📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: ODI Series: ENGపై న్యూజిలాండ్ గెలుపు

Author Icon By Aanusha
Updated: November 1, 2025 • 9:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూజిలాండ్ వన్డే జట్టు (New Zealand ODI squad) చరిత్ర సృష్టించింది. సొంత మైదానంలో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ (ODI Series) లో ఇంగ్లండ్ జట్టును 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ విజయంతో న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం రాసింది. గత 42 ఏళ్లలో ఇంగ్లండ్‌పై ఇంతటి ఆధిపత్యం ప్రదర్శించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

Read Also: Sanju Swap: సంజూ–స్టబ్స్ స్వాప్‌ డీల్‌ సెన్సేషన్‌!

ఈ ఘనత సాధించిన కెప్టెన్‌గా మిచెల్ సాంట్నర్ (Mitchell Santner) చరిత్రకెక్కాడు. ఇంగ్లండ్‌తో శనివారం జరిగిన ఆఖరి వన్డే (ODI Series) లో 2 వికెట్ల తేడాతో విజయం సాధించడం ద్వారా న్యూజిలాండ్ ఈ ఫీట్ సాధించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో 222 పరుగులు చేసింది. జెమీ ఓవర్టన్(62 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. జోస్ బట్లర్(56 బంతుల్లో 7 ఫోర్లతో 38), బ్రైడన్ కార్స్(30 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 36)

ODI Series

తొలి రెండు మ్యాచ్‌లను గెలిచిన న్యూజిలాండ్

విలువైన పరుగులు చేశారు.న్యూజిలాండ్ బౌలర్లలో బ్లయర్ టిక్‌నర్(4/64) నాలుగు వికెట్లు తీయగా.. జాకోబ్ డఫ్ఫీ(3/56) మూడు వికెట్లు పడగొట్టాడు. జాక్ ఫోల్కర్స్ రెండు వికెట్లు తీయగా.. మిచెల్ సాంట్నర్‌ ఒక వికెట్ పడగొట్టాడు.అనంతరం న్యూజిలాండ్ 44.4 ఓవర్లలో 8 వికెట్లకు 226 పరుగులు చేసి గెలుపొందింది.

రచిన్ రవీంద్ర(37 బంతుల్లో 7 ఫోర్లతో 46), డారిల్ మిచెల్(68 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 44) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో జెమీ ఓవర్టన్, సామ్ కరన్ రెండేసి వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీసారు.

ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లను గెలిచిన న్యూజిలాండ్ 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ చివరిసారిగా 1983లో జియోఫ్ హోవర్త్స్ సారథ్యంలో ఇంగ్లండ్ వైట్ వాష్ చేసింది. మళ్లీ ఇన్నాళ్లకు మిచెల్ సాంట్నర్ సారథ్యంలో ఈ ఘనతను అందుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Breaking News latest news Mitchell Santner captain New Zealand vs England ODI series NZ clean sweep 3-0 Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.