📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: ODI series: వన్డే సిరీస్.. గాయం కారణంగా ఆల్‌రౌండర్ కేమరూన్ ఔట్

Author Icon By Anusha
Updated: October 17, 2025 • 2:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగబోయే వన్డే సిరీస్ (ODI series) ప్రారంభానికి సరిగ్గా రెండు రోజుల ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు ప్రధాన ఆల్‌రౌండర్ కేమరూన్ గ్రీన్ (Cameron Green) గాయం కారణంగా మొత్తం సిరీస్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. కండరాల పట్టేయడం (muscle strain) వల్ల అతడు మైదానానికి దూరమయ్యాడు. ఈ పరిణామం ఆస్ట్రేలియా జట్టుకు ఒక పెద్ద షాక్‌గా మారింది.

Read Also: Test Twenty20:క్రికెట్‌లో నూతన ఫార్మాట్: ‘టెస్ట్ ట్వంటీ’ ఆవిష్కరణ

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా సెలక్షన్ కమిటీ అతడి స్థానంలో మార్నస్ లబుషేన్ (Marnus Labuschagne)ను వన్డే జట్టులోకి ఎంపిక చేసింది. ప్రస్తుతం జట్టుతో ఉన్న ఇతర ఆటగాళ్లు ఫిట్‌గా ఉన్నప్పటికీ, గ్రీన్ (Cameron Green) లాంటి ఆల్‌రౌండర్ లేకపోవడం జట్టుకు తాత్కాలిక బలహీనతను కలిగించింది. గ్రీన్ గైర్హాజరీతో ఆస్ట్రేలియా బ్యాటింగ్, బౌలింగ్ కాంబినేషన్‌లో మార్పులు తప్పవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఆస్ట్రేలియా టీం ఒక ప్రకటనలో.. “కేమరూన్ గ్రీన్ కొంతకాలం రిహాబిలిటేషన్ పూర్తి చేస్తాడు. ఆ తర్వాత యాషెస్ సిరీస్‌ కు సిద్ధమయ్యేందుకు షెఫీల్డ్ షీల్డ్ మూడవ రౌండ్‌లో ఆడటానికి ప్రయత్నిస్తాడు” అని తెలిపింది.కేమరూన్ గ్రీన్ స్థానంలో ఆస్ట్రేలియా వన్డే జట్టులో మార్నస్ లబుషేన్ చోటు దక్కించుకున్నాడు.

అద్భుతమైన ప్రదర్శన

లబుషేన్ గురువారం క్వీన్స్‌లాండ్ తరఫున షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌ (Sheffield Shield match) లో 159 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దేశవాళీ సీజన్‌లో ఇది మార్నస్ లబుషేన్‌కు నాలుగవ సెంచరీ కావడం విశేషం. 31 ఏళ్ల లబుషేన్ ఇప్పటివరకు 66 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడి, 34.64 సగటు, 83.56 స్ట్రైక్ రేట్‌తో 1871 పరుగులు చేశాడు.

ODI series

మార్నస్ లబుషేన్ భారత్‌పై కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతను భారత్‌పై ఇప్పటివరకు 15 వన్డే మ్యాచ్‌లు ఆడి, 13 ఇన్నింగ్స్‌లలో 474 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత ఏడాది 2023 ప్రపంచ కప్ (2023 World Cup) ఫైనల్‌లో కూడా మార్నస్ లబుషేన్ 58 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడి ఆస్ట్రేలియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. దీంతో గ్రీన్ స్థానంలో లబుషేన్ రాక భారత జట్టుకు అంత తేలికైన విషయం కాదని తెలుస్తోంది.

భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ షెడ్యూల్:

మొదటి వన్డే: అక్టోబర్ 19 (పెర్త్)

రెండవ వన్డే: అక్టోబర్ 23 (అడిలైడ్)

మూడవ వన్డే: అక్టోబర్ 25 (సిడ్నీ) ఈ మూడు మ్యాచ్‌లు భారత సమయం ప్రకారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి. 8:30 గంటలకు టాస్ పడుతుంది.

భారత వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (ఉప-కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్.

ఆస్ట్రేలియా వన్డే జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ కారీ, కూపర్ కోనొలీ, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, మార్నస్ లబుషేన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మిచెల్ ఓవెన్, మాట్ రెన్‌షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, మాథ్యూ కునేమన్, జోష్ ఫిలిప్.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Breaking News Cameron Green Injury India vs Australia latest news ODI Series Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.