NZ vs ENG: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా జరిగిన ఒక కీలక పోరులో ఇంగ్లండ్ జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. పటిష్టమైన న్యూజిలాండ్‌తో జరిగిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఇంగ్లీష్ జట్టు పైచేయి సాధించింది. ఈ ఓటమితో కివీస్ జట్టు నేరుగా సెమీస్‌కు వెళ్లే అవకాశాన్ని చేజార్చుకోగా, టోర్నీ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి.ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే న్యూజిలాండ్ నేరుగా సెమీ ఫైనల్‌కు అర్హత సాధించేది. కానీ ఇంగ్లండ్ చేతిలో ఓడిపోవడంతో కివీస్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. దీంతో వారి భవితవ్యం పాకిస్థాన్, శ్రీలంక మధ్య జరగబోయే మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంది. ఈ పోరులో పాక్ భారీ తేడాతో గెలిస్తే, మెరుగైన రన్ రేట్ ఆధారంగా న్యూజిలాండ్ ను వెనక్కినెట్టి సెమీస్ బెర్తు సొంతం చేసుకుంటుంది.
Read Also: Rinku Singh: రింకూ తండ్రి మృతి.. కోహ్లీ భావోద్వేగ ట్వీట్
160 పరుగుల లక్ష్యం
ఇవాళ కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (39), టిమ్ సీఫెర్ట్ (35) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, విల్ జాక్స్, రెహాన్ అహ్మద్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్, ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
అయితే, టామ్ బాంటన్ (33), శామ్ కరన్ (24) ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. చివర్లో విల్ జాక్స్ (18 బంతుల్లో 32 నాటౌట్), రెహాన్ అహ్మద్ (7 బంతుల్లో 19 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చారు. న్యూజిలాండ్ బౌలర్ రచిన్ రవీంద్ర 4 ఓవర్లలో కేవలం 19 పరుగులిచ్చి 3 వికెట్లు తీసినా ఫలితం లేకపోయింది. ఈ విజయంతో గ్రూప్ 2 సెమీస్ రేసు మరింత ఆసక్తికరంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: