📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20

Latest News: Novak Djokovic: నొవాక్ జకోవిచ్ అరుదైన ఘనత

Author Icon By Anusha
Updated: November 9, 2025 • 1:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సెర్బియా లెజెండ్ తన అద్భుత ప్రతిభ, దృఢ సంకల్పంతో టెన్నిస్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే మైలురాయిని సృష్టించాడు టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ (Novak Djokovic).. ఇటీవల ఏథెన్స్‌లో జరిగిన హెల్లెనిక్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఇటలీ ఆటగాడు లొరెంజో ముసెట్టీ (Lorenzo Musetti)పై గెలుపొందిన జకోవిచ్ తన కెరీర్‌లో 101వ ఏటీపీ టైటిల్‌ను అందుకున్నాడు.

Read Also: WWC 2025: ఉమెన్స్ ODI విజయం తర్వాత భారీగా పెరిగిన జెమీమా, షెఫాలీ బ్రాండ్ వాల్యూ

ఈ టైటిల్ గెలుపు జకోవిచ్‌ (Novak Djokovic) కు కేవలం ఒక ట్రోఫీ మాత్రమే కాదు.. టెన్నిస్ ప్రపంచంలో ఓ మైలురాయిగా నిలిచింది. ఇది జకోవిచ్ కెరీర్‌లో 72వ హార్డ్ కోర్ట్ టైటిల్ అంతకుముందు స్విట్జర్లాండ్‌కు చెందిన లెజెండ్ రోజర్ ఫెదరర్ పేరిట అత్యధికంగా 71 హార్డ్ కోర్ట్ టైటిల్స్ రికార్డు ఉండేది.

ఈ విజయం ద్వారా జొకోవిచ్ ఆ రికార్డును బద్దలు కొట్టి ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటగాడిగా 72 హార్డ్ కోర్ట్ టైటిల్స్ సాధించిన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.అత్యధిక హార్డ్ కోర్ట్ టైటిల్స్,*నొవాక్ జకోవిచ్-72,*రోజర్ ఫెదరర్-71,*ఆండ్రీ అగస్సీ-46

Novak Djokovic

జకోవిచ్‌కు అంత సులభంగా దక్కలేదు

లొరెంజో ముసెట్టితో జరిగిన ఫైనల్ మ్యాచ్ జకోవిచ్‌కు అంత సులభంగా దక్కలేదు. మూడు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోరులో జకోవిచ్ తన అనుభవాన్ని, పట్టుదలను ప్రదర్శించాడు. తొలి సెట్‌ను 4-6 తేడాతో కోల్పోయిన జకోవిచ్, రెండో సెట్‌లో 6-3తో పుంజుకున్నాడు.

నిర్ణయాత్మకమైన చివరి సెట్‌లో ఇద్దరి మధ్య హోరాహోరీ నడిచింది. ఈ సెట్‌లో రెండుసార్లు తన సర్వీస్‌ను కోల్పోయినప్పటికీ జకోవిచ్ చివరికి తన పట్టుదలతో 7-5 తేడాతో సెట్‌ను, మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు.

ATP టైటిల్ గెలిచిన అత్యంత పెద్ద వయస్కుడైన ఆటగాడిగా

38 ఏళ్ల 5 నెలల వయసులో ATP టైటిల్ గెలిచిన అత్యంత పెద్ద వయస్కుడైన ఆటగాడిగా కూడా జకోవిచ్ నిలిచాడు. 1977లో కెన్ రోస్‌వాల్ తర్వాత ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తి జొకోవిచ్.అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్- 24,గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో అత్యధిక ప్రదర్శనలు-37,గ్రాండ్‌స్లామ్ సెమీ-ఫైనల్స్‌లో అత్యధిక ప్రదర్శనలు-53,గ్రాండ్‌స్లామ్ క్వార్టర్-ఫైనల్స్‌లో అత్యధిక ప్రదర్శనలు- 64,ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రికార్డు టైటిల్స్- 10 (ఇవి హార్డ్ కోర్ట్ టైటిల్స్‌లో భాగం),మొత్తం ATP కెరీర్ టైటిల్స్: 101 (ఇది పురుషుల టెన్నిస్ చరిత్రలో 11వ అత్యధిక సంఖ్య).

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

ATP 101 titles Hard Court Record latest news novak djokovic Roger Federer Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.