టీమిండియా స్టార్ బ్యాటర్, ప్రస్తుత కప్తెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తన కెరీర్‌లోని కొన్ని అనుభూతులను ఇటీవలే అభిమానులతో పంచుకున్నాడు. క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడూ అతని ఆట, ఫిట్నెస్, స్మార్ట్ బ్యాటింగ్ (Smart batting) స్టైల్‌ను ప్రశంసిస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో, సూర్యకుమార్ ఒక చిన్న, విషయాన్ని బయటపెట్టాడు.
Harjas Singh: చరిత్ర సృష్టించిన భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా యువ క్రికెటర్
ఎందరో దిగ్గజాల సారథ్యంలో ఆడినప్పటికీ, ఒక విషయంలో మాత్రం తనకు తీరని లోటు ఉందని మనసులో మాట బయటపెట్టాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ (T20 series) కు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) నాయకత్వంలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోవడంపై తన ఆవేదన వ్యక్తం చేశాడు.
“ధోనీ (Dhoni) భారత జట్టు సారథిగా ఉన్నప్పుడు, అతడి కెప్టెన్సీలో ఒక్క మ్యాచ్ అయినా ఆడాలని నేను బలంగా కోరుకునేవాడిని. కానీ, ఆ అవకాశం నాకు రాలేదు” అని సూర్య తెలిపాడు. ఐపీఎల్‌లో ప్రత్యర్థులుగా ఆడినప్పుడు కూడా, ధోనీ ప్రశాంతత చూసి ఆశ్చర్యపోయేవాడినని చెప్పాడు.
తాను ఎక్కువగా ఆడింది మాత్రం రోహిత్ శర్మ నాయకత్వంలోనే
“స్టంప్స్ వెనుక అంత ఒత్తిడిలోనూ అతడు ఎంతో కూల్‌గా ఉండేవాడు. ఆ ఒత్తిడిని జయిస్తూ ప్రశాంతంగా ఎలా ఉండాలో ధోనీ నుంచే నేర్చుకున్నాను” అని సూర్య వివరించాడు.ఇక విరాట్ కోహ్లీ (Virat Kohli) కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ, అతడి సారథ్యంలోనే తాను అంతర్జాతీయ అరంగేట్రం చేశానని గుర్తుచేసుకున్నాడు.
“కోహ్లీ ఒక ‘టాస్క్ మాస్టర్’. ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టడానికి కఠినమైన లక్ష్యాలు నిర్దేశిస్తాడు. మైదానంలోనూ, బయట కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటూ మిగతా కెప్టెన్లకు భిన్నంగా కనిపిస్తాడు” అని కొనియాడాడు.అదే సమయంలో, తాను ఎక్కువగా ఆడింది మాత్రం రోహిత్ శర్మ (Rohit Sharma) నాయకత్వంలోనే అని సూర్య పేర్కొన్నాడు.
“భారత జట్టుతో పాటు ఐపీఎల్ (IPL) లోనూ రోహిత్ కెప్టెన్సీలో ఆడాను. తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ సౌకర్యంగా ఉంచేందుకు రోహిత్ ప్రయత్నిస్తాడు. ముఖ్యంగా యువ ఆటగాళ్లకు 24/7 అందుబాటులో ఉంటూ అండగా నిలుస్తాడు” అని సూర్య ప్రశంసించాడు. రోహిత్, విరాట్ వంటి వారి వద్ద కెప్టెన్సీ పాఠాలు నేర్చుకున్న సూర్య, ప్రస్తుతం భారత టీ20 జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: