📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Jay Shah: ఏ జట్టూ ఐసీసీ కంటే పెద్దది కాదు: జై షా

Author Icon By Anusha
Updated: March 15, 2026 • 11:31 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Jay Shah: టీ20 ప్రపంచకప్ 2026 నేపథ్యంలో చోటుచేసుకున్న ఉత్కంఠభరిత పరిణామాలపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఛైర్మన్ జై షా తొలిసారి స్పందించారు. ముంబైలో జరిగిన ‘ఇండియన్ బిజినెస్ లీడర్ అవార్డ్స్’ వేదికగా ఆయన మాట్లాడుతూ.. ఐసీసీ నిబంధనలు అందరికీ సమానమేనని, ఏ ఒక్క జట్టు కూడా బోర్డును శాసించలేదని కుండబద్దలు కొట్టారు. సంస్థ ప్రయోజనాలు, క్రీడా స్ఫూర్తే తమకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.

Read Also: Kuldeep Yadav Wedding: ఒక్కటైన కుల్దీప్ యాదవ్-వన్షిక చద్దా

బంగ్లాదేశ్ ఉదంతం.. స్కాట్లాండ్‌కు అవకాశం

భద్రతా కారణాల సాకుతో భారత్‌కు ప్రయాణించేందుకు బంగ్లాదేశ్ నిరాకరించడం, ఫలితంగా ఆ జట్టును టోర్నీ నుంచి తప్పించి స్కాట్లాండ్‌ను చేర్చుకోవడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. బంగ్లాకు మద్దతుగా తొలుత భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పాకిస్థాన్ హెచ్చరించినా, ఆ తర్వాత వెనక్కి తగ్గి టోర్నీలో పాల్గొంది.

No team is bigger than ICC: Jay Shah

ఇక టోర్నీ విజయవంతం కావడంపై జై షా హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వరల్డ్ కప్ వ్యూయర్‌షిప్ రికార్డులను తిరగరాసిందని ఆయన తెలిపారు. ఒకానొక సమయంలో ఏకంగా 7.2 మిలియన్ల మంది లైవ్ వ్యూయర్స్ టోర్నీని వీక్షించారని, ఇది క్రికెట్ చరిత్రలోనే ఒక మైలురాయి అని కొనియాడారు. కేవలం పెద్ద జట్లే కాకుండా యూఎస్ఏ, నెదర్లాండ్స్, జింబాబ్వే, నేపాల్ వంటి చిన్న జట్లు కూడా దిగ్గజ జట్లకు గట్టి పోటీ ఇచ్చి క్రికెట్ స్థాయిని పెంచాయని ఆయన ప్రశంసించారు.

చివరగా ప్రపంచకప్ నెగ్గిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్‌లకు జై షా ఒక కీలక సందేశం ఇచ్చారు. శిఖరాగ్రం నుంచి కిందకు పడిపోవడానికి కొన్ని నెలలు చాలని, కానీ అట్టడుగు నుంచి పైకి ఎదగడానికి ఏళ్లు పడుతుందని హెచ్చరించారు. కష్టపడి పని చేస్తూ విజయ పరంపరను కొనసాగించాలని సూచించారు. 2028 ఒలింపిక్స్‌తో పాటు 2030, 2031, 2036 వరకు భారత క్రికెట్ భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Bangladesh Cricket ICC Chairman Jay Shah T20 World Cup 2026

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.