ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ క్రికెట్ అభిమానులకు గట్టి ఉత్కంఠను కలిగిస్తోంది. లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచాడు. పిచ్ పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆ నిర్ణయం తొలుత సఫలమయ్యింది కూడా. ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలీ భారత బౌలర్లను ఆరంభం నుంచే తీవ్రంగా దెబ్బకొట్టారు. జస్ప్రిత్ బుమ్రా (Jasprit Bumrah) రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఇంగ్లిష్ ఓపెనర్ల వికెట్ తీయలేకపోయాడు. మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ సైతం వికెట్ దొరక్క ఇబ్బంది పడ్డారు. 14వ ఓవర్‌లో కెప్టెన్ శుభమన్ గిల్ బంతిని నితీష్ కుమార్ రెడ్డి చేతికి ఇవ్వగా డకెట్, క్రాలీ ఇద్దర్నీ అదే ఓవర్‌లో అవుట్ చేశాడు.మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నితీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆస్ట్రేలియా టూర్ తర్వాత బౌలింగ్‌పై ఎక్కువ దృష్టిసారించానని చెప్పాడు.
బౌలింగ్
ఐపీఎల్ సమయంలో తన కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) నుంచి కొన్ని చిట్కాలు తీసుకున్నానని.. మోర్నీ మోర్కెల్ పర్యవేక్షణలో తన బౌలింగ్‌లో మంచి పురోగతి కనిపించిందని నితీష్ కుమార్ రెడ్డి అన్నాడు. లార్డ్స్ టెస్టు మొదటి రోజు 14 ఓవర్లు వేసిన నితీష్ 46 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు.ఆస్ట్రేలియా టూర్ తర్వాత నా బౌలింగ్‌లో స్థిరత్వం తక్కువగా ఉందని నాకు అనిపించింది. అందుకే బౌలింగ్‌పైనే ప్రత్యేకంగా వర్క్ చేశాను. పాట్ కమిన్స్ నాకు ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్. ఆయన్ను నేను కొన్ని చిట్కాలు అడిగాను. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య పెద్ద తేడా ఉండదు, పరిస్థితులను గమనించి నీ ఆట నువ్వు ఆడు. ఎంత వీలయితే అంత నేర్చుకోవడానికి ప్రయత్నించు అని కమిన్స్ నాకు చెప్పాడు” అని నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) అన్నాడు.ఈ టూర్ విషయానికి వస్తే మోర్నీ మోర్కెల్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది.
అతనితో కలిసి పనిచేయడం చాలా బాగుంది
నాతో కొన్ని వారాల పాటు మోర్కెల్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయించాడు. నా బౌలింగ్‌లో మార్పులను ఇద్దరమూ గమనించాము. నిజంగా అతనితో కలిసి పనిచేయడం చాలా బాగుంది” అని నితీష్ కుమార్ రెడ్డి చెప్పాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ లార్డ్స్ టెస్టులో చాలా నిలకడగా ఆడింది. 44 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినా ఓలీ పోప్, జో రూట్ మ్యాచ్‌ని నిలబెట్టారు. పోప్ 104 బంతుల్లో 44 పరుగులు చేసి అవుటవ్వగా.. ఆ తర్వాత వచ్చిన బ్రూక్ 11 పరుగులకే బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ (Clean bowled) అయ్యాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 4 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేయగా.. జో రూట్ 99, బెన్ స్టోక్స్ 39 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు.
నితీష్ రెడ్డి విద్యార్హత ఏమిటి?
భారత క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి విద్యార్హత విషయానికొస్తే, ఆయన చిన్నతనంలోనే నర్సరీ స్కూల్‌లో విద్యాభ్యాసం ప్రారంభించారు. అనంతరం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ (B.Tech ECE) విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు.
నితీష్ కుమార్ రెడ్డి ఐపీఎల్‌లో అత్యధిక స్కోర్ ఎంత?
నితీష్ కుమార్ రెడ్డి ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు అత్యధిక స్కోర్ 76 పరుగులు నాటౌట్ (76*)గా నమోదైంది.ఈ సమయంలో ఆయన రెండు హాఫ్ సెంచరీలు (అర్ధశతకాలు) సాధించారు. మొత్తం తన ఐపీఎల్ కెరీర్‌లో 31 ఫోర్లు, 25 సిక్సర్లు బాదారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Yuvraj Singh: యువరాజ్ సింగ్ తనయుడిని చూసారా?