📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Nikhat Zareen: వరల్డ్ బాక్సింగ్ కప్‌లో నిఖత్ జరీన్ కు స్వర్ణం

Author Icon By Aanusha
Updated: November 21, 2025 • 6:59 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత బాక్సింగ్‌లో నిత్యం ప్రతిభను చాటుకుంటూ ముందుకు సాగుతున్న ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ (Nikhat Zareen) మరోసారి తన సత్తా ఏంటో చూపించింది. దాదాపు ఇరవై నెలల విరామం తర్వాత ఓ ప్రధాన అంతర్జాతీయ పోటీలో పాల్గొన్న ఆమె, తన అద్భుత ఆటతీరుతో వరల్డ్ బాక్సింగ్ వరల్డ్ కప్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

Read Also: Shubman Gill: నేడు గిల్‌కు ఫిట్‌నెస్ టెస్ట్

బిర్యానీ తినాలి

ఈ టోర్నీలో భారత మహిళా బాక్సర్ల బృందం అద్భుత ప్రదర్శన చేసింది. భారత్ గెలిచిన మొత్తం 20 పతకాలలో 10 పతకాలు మహిళలే సాధించడం విశేషం. ఇందులో ఏడు స్వర్ణాలు ఉన్నాయి.స్వర్ణం గెలిచిన అనంతరం ఎన్డీటీవీతో మాట్లాడుతూ నిఖత్ భావోద్వేగానికి గురైంది. “ఈ విజయం మాటల్లో చెప్పలేని అనుభూతినిచ్చింది.

ఆటలో ఎంత క్రమశిక్షణతో ఉన్నా, తన ఇష్టమైన ఆహారం బిర్యానీని వదులుకోవడం చాలా కష్టమని నిఖత్ (Nikhat Zareen) సరదాగా వ్యాఖ్యానించింది. “51 కేజీల విభాగంలో కొనసాగాలంటే ఆహారం విషయంలో కఠినంగా ఉండాలి. బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఇంటికి వెళ్లాక నేను చేసే మొదటి పని బిర్యానీ తినడమే.

Nikhat Zareen wins gold at World Boxing Cup

భారత మహిళా అథ్లెట్ల విజయం

అమ్మకు ఏమేం వండాలో ఇప్పటికే చెప్పేశాను” అంటూ నవ్వేసింది.చాలా నెలల తర్వాత సొంతగడ్డపై, మన ప్రేక్షకుల మధ్య పతకం గెలవడం ఎంతో సంతోషంగా ఉంది. దేశం గర్వపడేలా భవిష్యత్తులోనూ కష్టపడి ఆడతాను” అని ఆమె తెలిపింది.అయితే, ఈ విరామం ఎక్కువ కాలం ఉండదని, త్వరలోనే క్యాంపునకు తిరిగి వెళ్తానని చెప్పింది.

రాబోయే నేషనల్ ఛాంపియన్‌షిప్స్‌తో పాటు మార్చిలో జరిగే ఆసియన్ ఛాంపియన్‌షిప్స్‌పై దృష్టి సారిస్తానని తెలిపింది. ఆ టోర్నీలో గెలిస్తే మంచి ర్యాంకింగ్ పాయింట్లు లభిస్తాయని, అవి ఆసియా, కామన్వెల్త్ గేమ్స్‌లో సీడింగ్‌కు ఉపయోగపడతాయని వివరించింది.

భారత మహిళా క్రికెటర్ల విజయం గురించి మాట్లాడుతూ, “భారత మహిళా అథ్లెట్ల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది. ఇప్పుడు మాకు లభిస్తున్న ఆదరణ, ప్రోత్సాహం అద్భుతం. ఈ మద్దతు ముందే లభించి ఉంటే, కథ మరోలా ఉండేదేమో” అని అభిప్రాయపడింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Boxing World Cup India boxing Indian women latest news Nikhat Zareen Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.