NewZealand captain: టీమిండియాతో పోటీ పడటం సులభం కాదని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ వ్యాఖ్యానించారు. భారత జట్టులో కేవలం జస్ప్రీత్ బుమ్రా మాత్రమే కాదు, ప్రతి ప్లేయర్ మ్యాచ్‌ను మలుపు తిప్పగల సామర్థ్యం కలిగి ఉన్నాడని ఆయన అన్నారు. అందువల్ల ఇండియా టీమ్‌ను ఎదుర్కొనే సమయంలో చాలా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందని తెలిపారు.
Read Also:T20 world cup final 2026 : టీ20 ఫైనల్ ముందు అహ్మదాబాద్ స్టేడియానికి దిష్టి – వీడియో వైరల్
బుమ్రా గేమ్ చేంజర్.. అహ్మదాబాద్ పిచ్‌పై హై స్కోరింగ్ మ్యాచ్ అవకాశం
మీడియాతో మాట్లాడిన శాంట్నర్, బుమ్రా గురించి ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. ఆయన వరల్డ్ క్లాస్ బౌలర్ మాత్రమే కాకుండా మ్యాచ్ ఫలితాన్ని మార్చగల గేమ్ చేంజర్ అని పేర్కొన్నారు. కీలక సమయాల్లో వికెట్లు తీసే సామర్థ్యం బుమ్రాకు ఉందని అన్నారు.
అహ్మదాబాద్‌లో జరగనున్న మ్యాచ్‌కు సంబంధించిన పిచ్‌ను ఇంకా చూడలేదని శాంట్నర్ చెప్పారు. అయితే ఆ పిచ్‌పై మ్యాచ్ హై స్కోరింగ్‌గా ఉండే ఛాన్స్ ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇండియా టీమ్‌లో ప్రతి ప్లేయర్ కీలక సమయంలో మ్యాచ్‌ను టర్న్ చేసే సామర్థ్యం కలిగి ఉన్నాడని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: