📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

News Telugu: Sachin Tendulkar- ఇంగ్లండ్ క్రికెట్ ప్లేయర్ జో రూట్‌పై సచిన్ ప్రశంసల వర్షం

Author Icon By Sharanya
Updated: August 26, 2025 • 11:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

News Telugu: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన టెస్ట్ పరుగుల రికార్డుకు దగ్గరగా ఉన్న ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్‌ (Joe Root) పై ప్రశంసల వర్షం కురిపించారు. రూట్‌ను మొదటిసారి చూసినప్పుడే అతను భవిష్యత్తులో ఒక గొప్ప ఆటగాడు అవుతాడని తాను ఊహించినట్లు వెల్లడించాడు. ప్రస్తుతం సచిన్ 15,921 పరుగులతో టెస్ట్ చరిత్రలో అగ్రస్థానంలో ఉండగా, రూట్ ఇప్పటివరకు 13,543 పరుగులు సాధించి, ఆ రికార్డుకు చేరువ అవుతున్నాడు.

తొలి చూపులోనే గుర్తించిన ప్రతిభ

సోషల్ మీడియా వేదిక రెడిట్‌లో అభిమానులతో ముచ్చటించిన సచిన్‌ను ఒక అభిమాని రూట్ గురించి ప్రశ్నించాడు. దీనికి స్పందిస్తూ, “2012లో నాగ్‌పూర్‌లో రూట్ అరంగేట్రం చేసినప్పుడు నేను తొలిసారి చూశాను. అప్పుడే నా సహచరులకు, ‘ఇదే భవిష్యత్ ఇంగ్లండ్ కెప్టెన్’ అని చెప్పాను” అని సచిన్ గుర్తుచేసుకున్నారు. వికెట్‌ను అంచనా వేసే తీరు, స్ట్రైక్ రొటేట్ చేసే నైపుణ్యం రూట్‌ను ప్రత్యేకంగా నిలబెట్టాయని సచిన్ వెల్లడించారు. ఆ క్షణంలోనే అతను చాలా పెద్ద ఆటగాడు అవుతాడని నాకు అర్థమైంది” అని సచిన్ వివరించాడు.

పుజారాపై ప్రత్యేక అభినందనలు

ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తన మాజీ సహచరుడు ఛటేశ్వర్ పుజారా (Cheteshwar Pujara)ను కూడా సచిన్ ప్రత్యేకంగా అభినందించారు. “పుజారా, నువ్వు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తుంటే జట్టులో అందరికీ ధైర్యం కలిగేది. నీ టెక్నిక్, ఓపిక, ఒత్తిడిలో నిలకడగా ఆడే తీరు జట్టుకు అమూల్యమైన బలం ఇచ్చాయి” అని ఆయన తెలిపారు.

ఆస్ట్రేలియా సిరీస్‌లో పుజారా పాత్ర

2018-19లో ఆస్ట్రేలియాలో భారత్ చారిత్రక సిరీస్ విజయంలో పుజారా పోషించిన పాత్రను సచిన్ ప్రత్యేకంగా గుర్తుచేశారు. “ఆ విజయానికి నీ పోరాటం లేకపోతే సాధ్యం కాదని నిశ్చయంగా చెప్పగలను. నీ కెరీర్‌కు అభినందనలు. ఇక నీ రెండో ఇన్నింగ్స్‌కు శుభాకాంక్షలు” అని సచిన్ ట్వీట్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

read also:

https://vaartha.com/sachin-breaks-silence-on-arjun-tendulkars-engagement/sports/536052/

Breaking News Cheteshwar Pujara Cricket Records england cricket Joe Root latest news Sachin Tendulkar Telugu News Test Cricket

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.