📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

News Telugu: Rinku Singh- ఎంపీ ప్రియతో తన ప్రేమకథపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రింకూ సింగ్

Author Icon By Sharanya
Updated: August 23, 2025 • 1:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా యువ క్రికెటర్, ఐపీఎల్ స్టార్ రింకూ సింగ్ తన వ్యక్తిగత జీవితం గురించి ఎట్టకేలకు స్పందించాడు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియ సరోజ్‌ (MP Priya Saroj) తో తన ప్రేమ ప్రయాణం, నిశ్చితార్థానికి సంబంధించిన విషయాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. అకస్మాత్తుగా బయటపడిన వీరి నిశ్చితార్థం వార్త అభిమానులను ఆశ్చర్యపరచగా, రింకూ చెప్పిన వివరాలతో పూర్తి స్పష్టత లభించింది.

News Telugu

ముంబైలో మొదలైన ప్రేమకథ

తమ ప్రేమకథ 2022 ఐపీఎల్ సమయంలో ముంబైలో ప్రారంభమైందని రింకూ గుర్తుచేసుకున్నాడు. “ఒక ఫ్యాన్ పేజీలో ప్రియ ఫోటోను చూశాను. ఆమె సోదరి ఫోటోలు, వీడియోలు తీస్తుంటుంది. గ్రామంలో ఓటింగ్ కోసం సహాయం కోరుతూ ఆమె ఆ ఫోటో పెట్టారు. ఆ ఫోటో చూసిన వెంటనే నాకు బాగా నచ్చింది. తనే సరైన జోడీ అనిపించింది. కానీ వెంటనే మెసేజ్ చేయకూడదనిపించి ఆగిపోయాను” అని అన్నాడు.

సోషల్ మీడియాలో మొదలైన సంభాషణ

తరువాత ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) లో ప్రియ తన ఫోటోలకు లైక్ చేయడంతో ధైర్యం వచ్చిందని రింకూ చెప్పాడు. “ఆమె లైక్ చేసిన వెంటనే నేను మెసేజ్ పంపాను. అలా మాది సంభాషణ మొదలైంది. రెండు వారాల్లోనే మేం ప్రతిరోజూ మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. మ్యాచ్‌లకు ముందూ కూడా మాట్లాడుకునేవాళ్లం. అలా మెల్లగా మా మధ్య ప్రేమ పెరిగింది” అని వివరించాడు.

నిశ్చితార్థం – కొత్త ప్రయాణానికి ఆరంభం

ఈ జంటకు జూన్ 8న నిశ్చితార్థం (Engagement on June 8th) జరిగింది. అభిమానులకు ఇది నిజంగా ఒక సర్ప్రైజ్ గానే మారింది. రింకూ మాటల్లో – “ప్రియ ఎంపీ అయినా మా బంధంలో మార్పేమీ లేదు. అయితే, మాట్లాడుకునే సమయం మాత్రం తగ్గిపోయింది. ఆమె పనుల వత్తిడిలో ఎక్కువగా బిజీగా ఉంటుంది” అని అన్నాడు.

బిజీ షెడ్యూల్ మధ్యన కూడా ప్రేమ కొనసాగింపు

ప్రస్తుతం ప్రియ తన ఎంపీ బాధ్యతల్లో బిజీగా ఉన్నప్పటికీ, రాత్రివేళల్లో కొద్దిసేపైనా మాట్లాడుకుంటామని రింకూ చెప్పారు. “గ్రామాలకి వెళ్లడం, ప్రజలతో మాట్లాడడం, వారికి సహాయం చేయడం, పార్లమెంట్ సమావేశాలు… ఇలా ఉదయం బయలుదేరితే రాత్రి ఆలస్యంగా వస్తుంది. దాంతో మేం ఎక్కువగా మాట్లాడుకోలేకపోతున్నాం. అయినప్పటికీ మా బంధం బలంగా ఉంది” అని రింకూ వెల్లడించాడు.

ప్రజల కోసం కష్టపడుతున్న ప్రియ

తన జీవిత భాగస్వామి కేవలం రాజకీయాల్లోనే కాకుండా ప్రజల కోసం కష్టపడుతోందని రింకూ గర్వంగా చెబుతున్నాడు. “ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలో చేస్తేనే ప్రజల కోసం ఎంత కష్టపడుతుందో తెలుస్తుంది” అని వ్యాఖ్యానించాడు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/football-argentina-team-plays-friendly-match-in-kerala/sports/534769/

Breaking News Cricket News latest news MP Priya priya Saroj Rinku Singh Rinku Singh Love Story Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.