📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

New Zealand vs UAE : వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ విధ్వంసం, ఓపెనర్లు ఏం చేశారంటే!

Author Icon By Sai Kiran
Updated: February 10, 2026 • 8:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

New Zealand vs UAE : టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టు దూకుడు కొనసాగుతోంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన గ్రూప్-సి మ్యాచ్‌లో యూఏఈపై కివీస్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్, ఫిన్ అలెన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగి టీ20 వరల్డ్‌కప్ చరిత్రలోనే సరికొత్త రికార్డును నెలకొల్పారు.

174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్, కేవలం 15.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. టిమ్ సీఫెర్ట్ 42 బంతుల్లో 89 పరుగులు చేసి అజేయంగా నిలవగా, ఫిన్ అలెన్ 50 బంతుల్లో 84 పరుగులతో చెలరేగాడు. తొలి ఓవర్ నుంచే యూఏఈ బౌలర్లపై దాడి చేసిన ఈ జోడీ పవర్‌ప్లేలోనే 78 పరుగులు రాబట్టి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చింది. వీరిద్దరూ కలిసి అజేయంగా 175 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేసి ప్రపంచకప్ చరిత్రలో రికార్డు సృష్టించారు.

Read Also: Ranji Trophy 2026 : 299 వద్ద ఔట్, ట్రిపుల్ సెంచరీ మిస్! రంజీలో అరుదైన ఘటన

New Zealand vs UAE

అంతకుముందు టాస్ గెలిచిన యూఏఈ బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. కెప్టెన్ మహమ్మద్ వసీం (66 నాటౌట్), అలిషాన్ షరాఫు (55) అర్ధశతకాలతో రాణించారు. రెండో వికెట్‌కు వీరిద్దరూ 107 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ రెండు వికెట్లు తీయగా, మిచెల్ శాంట్నర్ ఒక వికెట్ సాధించాడు.

ఈ విజయంతో గ్రూప్-సిలో న్యూజిలాండ్ వరుసగా రెండో గెలుపును నమోదు చేయగా, యూఏఈ మాత్రం రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిని చవిచూసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu Cricket News Finn Allen Google News in Telugu Latest News in Telugu New Zealand Cricket New Zealand vs UAE opening partnership record T20 World Cup T20 World Cup records Telugu News Tim Seifert uae cricket world cup match

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.