📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Rishabh Pant : పంత్ స్థానంలో భార‌త జ‌ట్టులోకి కొత్త ప్లేయ‌ర్‌

Author Icon By Divya Vani M
Updated: July 28, 2025 • 7:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంగ్లండ్‌తో జరుగనున్న ఆఖరి ఐదో టెస్ట్‌కు ముందు భారత్‌కు షాక్ ఎదురైంది. మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్ట్‌లో కుడి పాదం గాయం కారణంగా వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) జట్టుకు దూరమయ్యాడు.బీసీసీఐ ఈ వార్తను ధృవీకరించింది. జులై 31 నుంచి లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో జరగనున్న ఐదో టెస్ట్‌కి పంత్ స్థానంలో నారాయణ్ జగదీశన్‌ (Narayan Jagadeesan)ను ఎంపిక చేసింది. పంత్ గాయం ప్రస్తుతం 1-2తో వెనుకబడిన భారత జట్టుకు గట్టి దెబ్బగా మారింది.

Rishabh Pant : పంత్ స్థానంలో భార‌త జ‌ట్టులోకి కొత్త ప్లేయ‌ర్‌

పంత్ రాణింపు జట్టుకు ఎంతగానో తోడ్పాటు

సిరీస్ మొత్తం పంత్ అద్భుతంగా రాణించాడు. మిడిల్ ఆర్డర్‌లో విలువైన పరుగులు చేసి జట్టుకు పెద్ద స్కోర్లు తెచ్చిపెట్టాడు. అతను లేని ఐదో టెస్టులో భారత్‌కు పెద్ద సమస్యగా మారవచ్చు.ఐదో టెస్టుకు పంత్ స్థానంలో జట్టులోకి వచ్చిన నారాయణ్ జగదీశన్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 52 మ్యాచ్‌లు ఆడాడు. 47.5 సగటుతో 3,373 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

చివరి టెస్ట్‌పై ఆశలు

ఈ నెల 31 నుంచి ఓవల్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేయాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది. కీలక మ్యాచ్‌లో జగదీశన్‌కు అవకాశం ఇస్తారా? లేక ధ్రువ్ జురెల్‌ను వికెట్ కీపర్‌గా ఆడిస్తారా? అనేది చూడాలి.శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్‌ దీప్, కుల్దీప్ యాదవ్, అన్షుల్ కాంబోజ్, అర్ష్‌దీప్ సింగ్, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్).

Read Also : Danish Kaneria : బీసీసీఐపై నిప్పులు చెరిగిన పాక్ మాజీ ఆటగాడు

Fifth Test India vs England Indian Cricket Team Narayan Jagadeesan Rishabh Pant Rishabh Pant Injury Team India Wicketkeeper Replacement

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.