భారత టెస్ట్ క్రికెట్‌లో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. ముఖ్యమైన మలుపులో జట్టు అడుగుపెడుతోంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) తాజా ప్రకటన ఇదే విషయాన్ని నిర్ధారించింది.రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ రిటైర్ అయ్యారు. వారిలాంటి ఆటగాళ్లు దూరం కావడం జట్టుకి పెద్ద లోటు. వారి స్థానాలు భర్తీ చేయడం అంత సులభం కాదు,(Their positions are not easy to replace) అగార్కర్ అన్నారు.జట్టు పునర్నిర్మాణం ఒక గొప్ప అవకాశమని అగార్కర్ అన్నారు. “ఇది కొత్త తరం ఆటగాళ్లకు పరీక్షా సమయం,” అని ఆయన పేర్కొన్నారు. కొత్త ఆటగాళ్లు తాము ఏమి చేయగలరో చూపించాల్సిన సమయం ఇదే.ఈ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్ బాధ్యతలు (Shubman Gill takes over as captain) అప్పగించారు. ఇది గిల్‌కు టెస్టుల్లో తొలి కెప్టెన్సీ. 25 ఏళ్ల వయసులోనే ఈ ఘనత అతనికి దక్కడం విశేషం.
రిషభ్ పంత్ వైస్ కెప్టెన్ – బాధ్యతల్లో మార్పు
వికెట్ కీపర్-బ్యాటర్ రిషభ్ పంత్‌ను ఉపనాయకుడిగా నియమించారు. గిల్, పంత్ జోడీపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఇద్దరూ ఆటలో ఆగ్రహితులే కాదు, నాయకత్వంలోనూ శక్తివంతమైన అభిరుచి ఉన్నవాళ్లు.
2011 తర్వాత తొలిసారి – టెస్ట్‌లో లెజెండ్స్ లేరు
ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా 2011 తర్వాత తొలిసారి, రోహిత్, విరాట్, అశ్విన్ లేని భారత టెస్ట్ జట్టు కనిపించనుంది. ఇది చరిత్రలో ఒక మలుపు.జట్టు ఎంపిక సందర్భంగా అగార్కర్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో చర్చకు దారితీశాయి. “ఇది భారత్ టెస్ట్ జట్టులో పరివర్తన కాలం,” అని ఆయన అన్నారు.
నేటి ఆటగాళ్లు, రేపటి లెజెండ్స్ అవ్వాలంటే?
ఇప్పటి యువ ఆటగాళ్లకు ఇది స్వర్ణావకాశం. గత దిగ్గజాల స్థానాన్ని భర్తీ చేయాలంటే నిరూపించుకోవాల్సిందే. వారిని పోలెవ్వరు, కానీ మించి చూపించగలిగితే సరికదా!
Read Also : RCB Vs SRH: కెప్టెన్లకు స్లో ఓవర్ రేట్ పై జరిమానాలు