New cricket rules 2026 : క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఆటను మరింత సరదాగా, అందరికీ అందుబాటులో ఉండేలా మార్చేందుకు Marylebone Cricket Club (ఎంసీసీ) కొత్త క్రికెట్ చట్టాలను ప్రకటించింది. మొత్తం 73 సవరణలతో రూపొందించిన ఈ కొత్త నియమావళి 2026 అక్టోబర్ 1 నుంచి ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి రానుంది.
ఈ మార్పుల్లో అత్యంత కీలకమైనది అమెచ్యూర్ క్రికెట్‌లో చౌక రకం లామినేటెడ్ బ్యాట్లకు అనుమతి ఇవ్వడం. ఇంగ్లిష్ విల్లో బ్యాట్ల ధరలు భారీగా పెరగడంతో సాధారణ ఆటగాళ్లకు భారంగా మారింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ‘టైప్-డి’ లేదా (New cricket rules 2026) లామినేటెడ్ బ్యాట్లను ఓపెన్ ఏజ్ క్రికెట్‌లోనూ వాడుకోవచ్చని ఎంసీసీ స్పష్టం చేసింది. దీంతో తక్కువ ధరలో బ్యాట్లు అందుబాటులోకి రానున్నాయి.
అదే సమయంలో ఆటను మరింత ఉత్కంఠభరితంగా మార్చేందుకు పలు కీలక నిబంధనలు తీసుకొచ్చారు. టెస్టు మ్యాచ్‌ల్లో చివరి ఓవర్ పూర్తయ్యే వరకు ఆట కొనసాగించాలి. బౌండరీ వద్ద ‘బన్నీ హాప్’ క్యాచ్‌లపై కఠిన నిబంధనలు విధించారు. వికెట్ కీపర్ గ్లోవ్స్ స్థానం, డిక్లరేషన్ హక్కులు, ఓవర్‌త్రోలు వంటి అంశాల్లో స్పష్టత తీసుకొచ్చారు.
Read Also: Delhi: రేపు NDA పార్లమెంటరీ పార్టీ సమావేశం
మహిళల, జూనియర్ క్రికెట్ కోసం బంతుల పరిమాణం, బరువుకు ప్రమాణాలు నిర్ణయించారు. అంతేకాకుండా నియమావళిలో లింగ సమానత్వ పదజాలాన్ని చేర్చడం, భాషను సులభతరం చేయడం వంటి మార్పులు చేశారు. ఈ సవరణలతో క్రికెట్ మరింత అందుబాటులోకి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: