📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Nepal Cricket: వెస్టిండీస్‌పై చారిత్రక టీ20 సిరీస్ గెలిచిన నేపాల్

Author Icon By Anusha
Updated: October 1, 2025 • 11:13 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అంతర్జాతీయ క్రికెట్‌లో నేపాల్ జట్టు ఒక చారిత్రక ఘట్టాన్ని సృష్టించింది. షార్జా వేదికగా జరిగిన టీ20 సిరీస్‌ (T20 series) లో వెస్టిండీస్‌పై వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించడం ద్వారా నేపాల్ మరో మైలురాయిని చేరుకుంది. సోమవారం జరిగిన రెండో టీ20లో నేపాల్ 90 పరుగుల తేడాతో అద్భుత గెలుపొందింది. ఈ విజయం ద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో తమ ఖాతాలో వేసుకుంది.

Dhanashree Varma : చాహల్‌ 2 నెలల్లోనే దొరికిపోయాడు: ధనశ్రీ

టెస్టు హోదా ఉన్న పూర్తిస్థాయి సభ్యత్వ జట్టుపై టీ20 ఫార్మాట్‌లో ప‌సికూన‌ నేపాల్‌కు ఇదే తొలి సిరీస్ విజయం కావడం విశేషం.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్, ఆసిఫ్ షేక్, సందీప్ జోరా సాధించిన హాఫ్ సెంచరీల సహాయంతో నిర్ణీత ఓవర్లలో 173 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది.

ఆరంభంలో అకీల్ హోసేన్, కైల్ మేయర్స్ (Aqeel Hossain, Kyle Meyers) దెబ్బకు తడబడినప్పటికీ, ఈ ఇద్దరు బ్యాటర్లు కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నారు.అనంతరం 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్, నేపాల్ బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. కేవలం 83 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

Nepal Cricket

మ్యాచ్ అనంతరం నేపాల్ ఆటగాడు ఆసిఫ్ షేక్ మాట్లాడుతూ,

నేపాల్ బౌలర్ మహమ్మద్ ఆదిల్ ఆలం (Mohammed Adil Alam) నాలుగు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించాడు. ఇది టీ20 క్రికెట్‌లో ఒక అసోసియేట్ జట్టు చేతిలో పూర్తిస్థాయి సభ్యత్వ జట్టు నమోదు చేసిన అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. గతంలో 2014లో నెదర్లాండ్స్‌పై ఇంగ్లండ్ 88 పరుగులకు ఆలౌట్ అయిన రికార్డును ఇది బద్దలు కొట్టింది.మ్యాచ్ అనంతరం నేపాల్ ఆటగాడు ఆసిఫ్ షేక్ మాట్లాడుతూ,

“ఈ పిచ్‌పై 160 పరుగులు మంచి స్కోరని భావించాం. నెమ్మదిగా ఆడి భాగస్వామ్యం నిర్మించాలనుకున్నాం, అదే చేశాం. మా దేశంలో క్రికెట్ (Cricket) ఒక పండుగలాంటిది. మాకు మద్దతు ఇచ్చే అభిమానులకు కృతజ్ఞతలు. సిరీస్‌ను 3-0తో గెలవాలని అనుకుంటున్నాం” అని తెలిపాడు.విండీస్ కెప్టెన్ అకీల్ హోసేన్ మాట్లాడుతూ, నేపాల్ విజయాన్ని ప్రశంసించాడు.

“నేపాల్‌పై సులువుగా గెలుస్తామని అందరూ అనుకున్నారు. కానీ వారు పరిస్థితులకు అద్భుతంగా అలవాటుపడ్డారు. బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించారు. ఈ గెలుపున‌కు వారు పూర్తిగా అర్హులు” అని వ్యాఖ్యానించాడు. ఈ చారిత్రక విజయం టీ20 క్రికెట్‌లో వర్ధమాన జట్లు కూడా సత్తా చాటగలవని మరోసారి నిరూపించింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

#telugu News Breaking News historic victory latest news nepal cricket Nepal cricket history Nepal team record nepal vs west indies Sharjah T20 match T20 series win

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.