📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Nepal: టీ20ల్లో చరిత్ర సృష్టించిన నేపాల్‌

Author Icon By Anusha
Updated: September 28, 2025 • 10:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త శకం ప్రారంభమైందని చెప్పడానికి ఈ ఫలితం సరిపోతుంది. చిన్న దేశంగా, పసికూన జట్టుగా భావించే నేపాల్ (Nepal), ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను గర్వంగా శాసించిన రెండు సార్లు టీ20 వరల్డ్‌కప్ విజేత వెస్టిండీస్ జట్టుకు పెద్ద షాక్ ఇచ్చింది. శనివారం షార్జాలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌ (T20 match) లో 19 పరుగుల తేడాతో నేపాల్ చారిత్రక విజయం సాధించింది. ఈ విజయం నేపాల్ క్రికెట్ చరిత్రలో లిఖించబడింది.

Sheetal Devi: శీత‌ల్ దేవికి గోల్డ్ మెడ‌ల్

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) (ICC) పూర్తిస్థాయి సభ్యదేశంపై టీ20 ఫార్మాట్‌లో నేపాల్‌కు ఇదే మొట్టమొదటి గెలుపు కావడం విశేషం. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో నేపాల్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ (West Indies) బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఆ జట్టు ఆదిలోనే కుశాల్ భుర్తెల్ (5), ఆసిఫ్ షేక్ (3) వికెట్లను త్వరగా కోల్పోయింది.

 Nepal

ఆ దశలో కెప్టెన్ రోహిత్ పౌడెల్ (35 బంతుల్లో 38), కుశాల్ మల్లా (21 బంతుల్లో 30), గుల్సన్ ఝా (16 బంతుల్లో 22) కీలక ఇన్నింగ్స్‌ (innings) లు ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. విండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్ 20 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, నవీన్ బిదైసీ 3 వికెట్లు తీశాడు.అనంతరం 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్, నేపాల్ బౌలర్ల ధాటికి తడబడింది.

ఏ దశలోనూ విండీస్ బ్యాటర్లు నిలకడగా ఆడలేకపోయారు

ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ ఓటమిని కొనితెచ్చుకుంది. ఏ దశలోనూ విండీస్ బ్యాటర్లు నిలకడగా ఆడలేకపోయారు. నవీన్ బిదైసీ (Naveen Bidaisi) (22), అమీర్ జంగూ (19) మాత్రమే కాస్త ఫరవాలేదనిపించారు.

చివర్లో ఫాబియన్ అలెన్ (19), కెప్టెన్ అకీల్ హొసేన్ (18) కాస్త పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరికి వెస్టిండీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. నేపాల్ బౌలర్లలో కుశాల్ భుర్తెల్ రెండు వికెట్లతో రాణించాడు. రెండో టీ20 మ్యాచ్ సెప్టెంబర్ 29న జరగనుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

cricket upset first t20 victory historic win icc full member nepal cricket nepal vs west indies sharjah match t20 international t20 series 2025 west indies shock

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.