📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్

Neeraj Chopra: నీరజ్‌ చోప్రా ఘనత నెలరోజుల్లోనే రెండు టైటిల్స్

Author Icon By Sharanya
Updated: June 25, 2025 • 1:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత జావెలిన్ త్రోయర్ (Javelin thrower) , ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా (Neeraj Chopra) తన అసాధారణ ప్రతిభను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పాడు. చెక్ రిపబ్లిక్‌లోని ఓస్ట్రావా నగరంలో జూన్ 24న నిర్వహించిన ప్రతిష్ఠాత్మక గోల్డెన్ స్పైక్ 2025 అథ్లెటిక్స్ మీట్లో అతను 85.29 మీటర్ల అద్భుత త్రోతో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. దీంతో మరో త్రో మిగిలి ఉండగానే నీరజ్ విజయం ఖాయమైంది. ఇది అతని ఇటీవల కాలంలో రెండో పెద్ద విజయం కావడం విశేషం.

మూడు ప్రయత్నాల్లోనే విజయం ఖాయం

ఈ పోటీలో మొత్తం ఆరు రౌండ్లు ఉండగా, నీరజ్ తొలి ప్రయత్నం ఫౌల్ కావడంతో రెండో ప్రయత్నంలో 83.45 మీటర్లు విసిరిన అత‌డు, మూడో ప్రయత్నంలో అద్భుతంగా పుంజుకుని 85.29 మీటర్లతో అందరికంటే ముందు నిలిచాడు. ఆ తర్వాత నాలుగో ప్రయత్నంలో 82.17 మీటర్లు, ఐదో ప్రయత్నంలో 81.01 మీటర్లు మాత్రమే నమోదు చేశాడు. తన ఆరో, చివరి ప్రయత్నాన్ని సరిగ్గా విసరలేకపోయానని భావించి ఉద్దేశపూర్వకంగానే ఫౌల్ చేశాడు.

గత నెలలో డైమండ్ లీగ్ టైటిల్ కూడా

ఇదే సీజన్‌లో, ఆయనకు ఇది మరో అగ్రశ్రేణి విజయం కావడం విశేషం. కొద్ది రోజుల క్రితమే పారిస్ డైమండ్ లీగ్ మీట్‌లో విజేతగా నిలిచిన నీరజ్, నెల రోజుల వ్యవధిలోనే రెండో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇతర విజేతలు

ఈ పోటీలో దక్షిణాఫ్రికాకు చెందిన డౌవ్ స్మిత్ 84.12 మీటర్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెలుచుకోగా, గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 83.63 మీటర్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం దక్కించుకున్నారు.

Read also: India vs England: ఆదిలోనే హంసపాదం: తొలి మ్యాచ్‌లో పరాజయం

#GoldenSpike2025 #IndianAthlete #JavelinThrow #NeerajChopra #NeerajChopraVictory #NeerajWinsGold #OlympicChampion Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.