📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Mushfiqur Rahim: టెస్టులో ముష్ఫికర్ రహీమ్ అరుదైన ఘనత

Author Icon By Anusha
Updated: November 20, 2025 • 3:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్, వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ (Mushfiqur Rahim) తన కెరీర్‌లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. తన వందో టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. గురువారం ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ముష్ఫికర్‌ తన టెస్ట్‌ కెరీర్‌లో 13వ సెంచరీ చేశాడు.

Read Also: Manoj Tiwari: గంభీర్‌పై మనోజ్ తివారీ ఆగ్రహం

100వ అంతర్జాతీయ మ్యాచ్‌లో శతకం – అరుదైన రికార్డు

కెరీర్‌లో 100వ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతూ.. సెంచరీ చేసిన 11వ ప్లేయర్‌గా నిలిచాడు.తొలి రోజు ఆట ముగిసే సమయానికి 99 పరుగుల వద్ద నాటౌట్‌గా నిలిచిన ముష్ఫికర్ (Mushfiqur Rahim), రెండో రోజు తన శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. తర్వాతి ఓవర్‌లో సింగిల్ తీసి సెంచరీ మార్క్ అందుకోగానే స్టేడియం మొత్తం హర్షాతిరేకాలతో మార్మోగింది.

Mushfiqur Rahim’s rare feat in Tests

అతను నెమ్మదిగా ఆడతాడని, కచ్చితంగా సెంచరీ చేస్తాడని బంగ్లా మాజీ కెప్టెన్ మోమినుల్ హక్ ముందురోజే చెప్పిన మాట నిజమైంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కేవలం 10 మంది మాత్రమే తమ వందో టెస్టులో సెంచరీ చేయగలిగారు. ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ (David Warner) 2022లో దక్షిణాఫ్రికాపై ఈ ఘనత సాధించగా, ఇప్పుడు ముష్ఫికర్ ఆ జాబితాలో చేరాడు.

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తన వందో టెస్టులోని రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీలు చేయడం విశేషం. జో రూట్, హషీమ్ ఆమ్లా, ఇంజమామ్ ఉల్ హక్, జావేద్ మియాందాద్ వంటి దిగ్గజాలు ఈ జాబితాలో ఉన్నారు. అయితే, ఇప్పటివరకు ఒక్క భారత ఆటగాడు కూడా ఈ రికార్డును అందుకోలేకపోవడం గమనార్హం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Bangladesh Cricket bangladesh vs ireland test latest news mushfiqur rahim century rahim 100th match century Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.