ఐపీఎల్ 2025 సీజన్‌లో గురువారం సొంత వేదికపై సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)నూ చిత్తు చేసింది ముంబై ఇండియన్స్.వాంఖడేలో జరిగిన పోరులో హైదరాబాద్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి ఈ సీజన్‌లో మూడో విజయాన్ని నమోదు చేసింది. మొదట బౌలర్లు సమిష్టిగా రాణించి సన్‌రైజర్స్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయగా బ్యాటర్లు వేగంగా ఆడి ఆ జట్టును గెలిపించారు. స్వల్ప లక్ష్యాన్ని ముంబై 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విల్ జాక్స్ (26 బంతుల్లో 36, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రికెల్టన్ (23 బంతుల్లో 31, 5 ఫోర్లు) రాణించారు. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ 20 ఓవర్లలో 162/5కే పరిమితమైంది. అభిషేక్ శర్మ (28 బంతుల్లో 40, 7 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా క్లాసెన్ (38) ఫర్వాలేదనిపించాడు. జాక్స్ (2/14)తో పాటు ఎంఐ పేసర్లు హైదరాబాద్‌ను కట్టడిచేశారు. విల్ జాక్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్‌కు ఇది ఐదో ఓటమి కావడం గమనార్హం.
స్కేర్ లెగ్
బ్యాటింగ్‌లో సన్‌రైజర్స్ తడబడ్డ పిచ్‌పై ముంబై మాత్రం అలవోకగా లక్ష్యాన్ని అందుకుంది. షమీ రెండో ఓవర్లోనే ఇంప్యాక్ట్ ప్లేయర్ రోహిత్ శర్మ (16 బంతుల్లో 26, 3 సిక్సర్లు) తనదైన ట్రేడ్‌మార్క్ సిక్సర్లతో అలరించాడు. కమిన్స్ ఓవర్‌లోనూ స్కేర్ లెగ్ మీదుగా సిక్స్ కొట్టిన హిట్‌మ్యాన్ అదే ఓవర్లో ఐదో బంతికి హెడ్‌కు క్యాచ్ ఇచ్చాడు. మరో ఓపెనర్ రికెల్టన్ (31) ఇషాన్ మలింగ బౌలింగ్‌లో వరుసగా మూడు బౌండరీలు బాదాడు. హర్షల్ 8వ ఓవర్లోనూ బ్యాక్‌టుబ్యాక్ బౌండరీలు కొట్టిన అతడు ఐదో బంతికి ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన సూర్యతో జతకలిసిన జాక్స్ ముంబై ఛేదనను వేగవంతం చేశాడు. ఈ ఇద్దరూ ఓవర్‌కు 10 పరుగులకు తగ్గకుండా ఆడటంతో లక్ష్యం క్రమంగా కరిగిపోయింది. మూడో వికెట్‌కు 29 బంతుల్లోనే 52 రన్స్ జోడించిన వీరిని కమిన్స్ విడదీశాడు. సూర్యతో పాటు జాక్స్ కూడా కమిన్స్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరినా ముంబై పెద్దగా ఇబ్బందిపడలేదు. ఆఖర్లో కెప్టెన్ హార్దిక్(21), నమన్ ధీర్(0) వెంటవెంటనే ఔటైనా సాంట్నర్(0)తో కలిసి తిలక్‌వర్మ(21 నాటౌట్) జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. కమిన్స్(3/26), మలింగ(2/36) ఆకట్టుకున్నారు.
హెన్రిచ్ క్లాసెన్
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. హైదరాబాద్ తరఫున బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, అభిషేక్ శర్మ 40 పరుగులు చేసి అత్యధిక ఇన్నింగ్స్ ఆడాడు. హెన్రిచ్ క్లాసెన్ 37 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్ తరఫున బౌలింగ్ చేస్తున్నప్పుడు, విల్ జాక్స్ గరిష్టంగా 2 వికెట్లు పడగొట్టాడు. దీని తర్వాత ముంబై ఇండియన్స్ 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ముంబై ఇండియన్స్ తరపున బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, విల్ జాక్స్ అత్యధికంగా 36 పరుగులు చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో కెప్టెన్ పాట్ కమ్మిన్స్ 3 వికెట్లు పడగొట్టాడు.
Read Also: Travis Head: రోహిత్ శర్మను చూసి ప్రేరణ పొందాను:ట్రావిస్ హెడ్