చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానుల హృదయాల్లో శాశ్వతంగా స్థానం సంపాదించుకున్న మాహీ –మహేంద్ర సింగ్ ధోనీ, తన భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చారు. క్రికెట్ ఆడకపోయినా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తన అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుందన్న ధోనీ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాయి.ఇప్పుడు జరుగుతున్న 2025 ఐపీఎల్ సీజన్‌లో, యువ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయపడడంతో, ధోనీ మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఈ సీజన్‌లో సీఎస్కే జట్టు నిరుత్సాహకరమైన ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈ కారణంగా అభిమానుల మధ్య ధోనీ రిటైర్మెంట్ (Dhoni’s retirement) పై ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. అంతేకాదు, ప్రతి మ్యాచ్ అనంతరం “ఇదే చివరి సీజనా?”, “ఇంకా ఆడతారా?” అనే ప్రశ్నలు సోషల్ మీడియా నిండా హల్‌చల్ చేశాయి.
నేను ఎప్పటికీ పసుపు జెర్సీలోనే ఉంటాను
ఈ నేపథ్యంలో ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీ, తన భవిష్యత్తుపై అడిగిన ప్రశ్నకు స్పందించారు. “నా భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది. కానీ నేను పసుపు జెర్సీ (Yellow jersey) వేసుకుని తిరిగి వస్తానా అనే విషయానికి వస్తే, నేను ఎప్పటికీ పసుపు జెర్సీలోనే ఉంటాను. ఆడతానా? ఆడనన్నా? అనేది వేరే విషయం,” అంటూ ధోనీ జవాబిచ్చారు. ఈ మాటలతో అభిమానుల్లోని ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.అంతేకాదు, “నేను, సీఎస్కే కలిసి రాబోయే 15-20 ఏళ్ల పాటు ముందుకు సాగుతాం. అయితే, అన్ని సంవత్సరాలూ నేను ఆడతానని మాత్రం ఆశించవద్దు” అంటూ ధోనీ చమత్కరించారు. ఈ వ్యాఖ్యలు చెన్నై అభిమానుల్లో ఆనందావేశాన్ని కలిగించగా, మాహీ అంటే సీఎస్కే అనే తత్వాన్ని మరోసారి నెరవేర్చాయి.
మా ప్రదర్శన
2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి సీఎస్కేకు ప్రాతినిధ్యం వహిస్తున్న ధోనీ, తన సారథ్యంలో జట్టుకు ఐదుసార్లు టైటిల్ అందించాడు. చెన్నై జట్టుతో, నగరంతో తనకున్న బంధం గురించి ఆయన మాట్లాడుతూ, “గడిచిన కొన్నేళ్లుగా ఈ బంధం మరింత బలపడింది. ఒక వ్యక్తిగా, ఒక క్రికెటర్‌గా ఎదగడానికి ఇది నాకు ఎంతగానో సహాయపడింది. సీఎస్కే నాకు మంచి చేసింది, చెన్నైకి కూడా మంచి చేసింది” అని వివరించాడు.గత రెండు సీజన్లుగా జట్టు ప్రదర్శనపై కూడా ధోని స్పందించాడు. “గత రెండు సీజన్లుగా మా ప్రదర్శన బాగాలేదు. మేము మా స్థాయికి తగ్గట్టు ఆడలేదు. అయితే, జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడం చాలా ముఖ్యం. గత ఏడాది కూడా మా ముందు ఇదే ప్రశ్న తలెత్తింది” అని ఎంఎస్‌డీ విశ్లేషించాడు. ధోనీ తాజా వ్యాఖ్యలతో మైదానంలో అతని ఆట ముగిసినా, సీఎస్కేతో బంధం మాత్రం కొనసాగుతుందని స్పష్టమైంది.
ఎంఎస్ ధోనీ జన్మతేది ఎప్పుడు?
జూలై 7, 1981.
ధోనీ భారత జట్టుకు కెప్టెన్‌గా ఎప్పుడు నియమించబడ్డారు?
2007లో టీ20 జట్టుకు కెప్టెన్‌గా నియమించబడ్డారు. ఆ తర్వాత వన్డే, టెస్టు కెప్టెన్ అయ్యారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: