📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

MS Dhoni: ధోనీ స్టన్నింగ్ లుక్స్ చూసారా?

Author Icon By Anusha
Updated: July 30, 2025 • 3:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) మరోసారి తన ప్రత్యేకమైన లుక్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఎప్పుడూ సింపుల్, స్టైలిష్ లుక్‌తోనే మెరిసే ధోనీ.. తాజాగా మరోసారి తన కొత్త హెయిర్ స్టైల్, గెటప్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాడు.భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ధోనీ ఒకడు. మైదానంలో కూల్ మైండ్‌సెట్, అసాధారణమైన లీడర్‌షిప్‌తో జట్టును అనేక విజయాల దిశగా నడిపించాడు. అయితే మైదానం బయట కూడా ధోనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రత్యేకమే. ముఖ్యంగా ఆయన హెయిర్ స్టైల్ ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది. జులపాల జుట్టుతో భారత జట్టులోకి అడుగుపెట్టిన ధోనీ అప్పట్లో యువతకు స్టైల్ ఐకాన్‌గా మారాడు. ఆయన ప్రభావంతో అనేక మంది అభిమానులు జులపాల హెయిర్ స్టైల్‌ను ఫాలో అయ్యారు.

యాడ్ షూటింగ్ 

తాజాగా యాడ్ షూటింగ్ సందర్భంగా ధోనీ కనిపించిన కొత్త లుక్ అభిమానుల మనసు దోచేస్తోంది. షార్ట్ హెయిర్, స్టైలిష్ గడ్డం, బ్లాక్ టీషర్ట్, గాగుల్స్‌తో ధోనీ లుక్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. “అదిరిపోయింది బాస్”, “ధోనీ లుక్ సింప్లీ సూపర్”, “మన మాహీ మరోసారి స్టైల్ ఐకాన్” అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ధోనీ హెయిర్ స్టైల్ (Dhoni hairstyle) గురించి చెప్పుకుంటే పాకిస్థాన్ మాజీ ప్రధాని పర్వేజ్ ముషార్రఫ్ కూడా ప్రత్యేకంగా ఆయన జుట్టును కొనియాడిన సంఘటన గుర్తుకు వస్తుంది. 2005లో జరిగిన ద్వైపాక్షిక సిరీస్ సందర్భంగా ముషార్రఫ్, ధోనీకి “నీ హెయిర్ స్టైల్ మార్చొద్దు” అని సూచించారు. 2011 వరల్డ్‌కప్ తర్వాత ధోనీ జులపాల జుట్టును కత్తిరించుకున్నప్పటికీ, అప్పటి నుంచి ప్రతి సారి కొత్త లుక్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటూనే ఉన్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌

యాడ్ షూట్స్, ఈవెంట్స్ కోసం ధోనీ తరచూ కొత్త హెయిర్ స్టైల్స్‌ని ట్రై చేస్తూ ట్రెండ్స్‌కు తగ్గట్టు తన లుక్ మార్చుకుంటాడు. ఇటీవల వచ్చిన ఈ కొత్త లుక్ కూడా అదే క్రమంలో భాగమని చెబుతున్నారు. ధోనీ లేటెస్ట్ లుక్ చూసి అభిమానులు మాత్రమే కాకుండా నెటిజన్లు కూడా మంత్రముగ్ధులవుతున్నారు.ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై 5 ఏళ్లు పూర్తవుతున్నా.. అతని క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. కేవలం ఐపీఎల్ (IPL) లో, మాత్రమే ఆడుతున్న ధోనీ.. వ్యాపార ప్రకటనల ద్వారా ఏడాదికి సుమారు రూ. 100 కోట్లు ఆర్జిస్తున్నాడు. యాడ్ షూటింగ్స్, ఐపీఎల్ లేని సమయంలో ధోనీ.. తన 40 ఎకరాల ఫామ్‌హౌస్‌లో వ్యవసాయం చేస్తున్నాడు. స్వయంగా తానే అన్నీ పనులు చేస్తున్నాడు. ఈ ఫామ్‌ హౌస్‌లో డైరీ, స్ట్రాబెర్రీ, కాలిఫ్లవర్, వరి వంటి పంటలను పండించిన ధోనీ..కడక్ నాథ్ కోళ్ల‌ను కూడా పెంచుతున్నాడు.

తాజా నివేదికల ప్రకారం ధోనీ నెట్ వర్త్

దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ధోనీ కోట్లు సంపాదించినా.. సాధారణంగా జీవించడానికే ఎక్కువ ఇష్టపడుతాడు. ఐపీఎల్ టైమ్‌లో మినహా.. మిగతా సమయాన్ని మొత్తం ఫామ్ హౌస్‌లో గడిపేందుకు ప్రయత్నిస్తాడు. వ్యాపారాల విషయంలో తన సతీమణికి అండగా ఉంటాడు. తాజా నివేదికల ప్రకారం ధోనీ నెట్ వర్త్ రూ. 1000 కోట్లుగా ఉంది. ధోనీ ప్రధాన ఆధాయ వనరులు బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారానే వస్తాయి. పెప్సీ, రీబాక్, టీవీఎస్ మోటార్స్, గల్ఫ్ ఆయిల్, డ్రీమ్11, ఓరియంట్ ఎలక్ట్రిక్, మాస్టర్‌కార్డ్ వంటి 30కి పైగా బ్రాండ్‌లకు అతను ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు.

ధోనీ పెట్టుబడులు

బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారానే ఏడాదికి రూ.100 కోట్లు ఆర్జిస్తున్నాడు. ధోనీకి సొంతంగా సెవెన్(లైఫ్‌స్టైల్ బ్రాండ్), చెన్నైయిన్ ఎఫ్‌సీ(ఫుట్‌బాల్ టీమ్), స్పోర్ట్స్‌ఫిట్ వరల్డ్ (జిమ్), హోటల్ మహి రెసిడెన్సీ, 7ఇంక్ బ్రూస్, కడక్ నాథ్ కోళ్ల వ్యాపారం, ఎంఎస్ ధోనీ గ్లోబల్ స్కూల్‌లు ఉన్నాయి. ఖతాబుక్ , కార్స్24 , బ్లూస్మార్ట్ మొబిలిటీ , గరుడ ఏరోస్పేస్, రిగి , ఎమోటోరాడ్ వంటి అనేక స్టార్టప్స్‌లో ఏంజిల్ ఇన్వెస్టర్‌గా ధోనీ పెట్టుబడులు పెట్టారు.మైదానంలో ధోనీ కూల్ ఫినిషర్‌గా జట్టుకు అద్భుత విజయాలు అందిస్తుండగా, మైదానం బయట తన సింపుల్, స్టైలిష్ లుక్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఈ కొత్త లుక్‌తో మాహీ మరోసారి ట్రెండ్స్‌లో నిలిచాడు అనడంలో సందేహం లేదు.

ధోనీ కంటే విరాట్ కోహ్లీ ధనవంతుడా?

అవును, విరాట్ కోహ్లీ ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోనీ కంటే ధనవంతుడిగా పరిగణించబడుతున్నాడు. 2025 నాటికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం విరాట్ కోహ్లీ నికర సంపద సుమారు $127 మిలియన్ (₹1055 కోట్లు)గా అంచనా వేయబడింది.

ఎంఎస్ ధోనీ శాకాహారినా లేక మాంసాహారినా?

ఎంఎస్ ధోనీ మాంసాహారి. అయితే 2004లో ఇండియా A క్యాంప్ సమయంలో తన రూమ్‌మేట్ ఆకాష్ చోప్రా శాకాహారి కావడంతో, ధోనీ ఒక నెల పాటు పూర్తిగా శాకాహార ఆహారమే తీసుకున్నాడు.తన స్నేహితుడి అభిరుచిని గౌరవిస్తూ ఆ సమయంలో మాంసాహారం మానుకున్నాడు. కానీ సాధారణంగా ధోనీ మాంసాహారాన్ని ఇష్టపడతాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: IND vs ENG: టీమిండియా సెలెక్షన్ కమిటీపై సుందర్ తండ్రి అసహనం

Bollywood Hero Look Dhoni Breaking News Dhoni Short Hair Beard Style Dhoni Stylish Haircut 2025 latest news MS Dhoni Black T-Shirt Photoshoot MS Dhoni New Look Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.