📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

MS Dhoni: తన స్నేహితుల సమక్షంలో ధోనీ బర్త్ డే సెలెబ్రేషన్స్

Author Icon By Anusha
Updated: July 7, 2025 • 5:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ నాయ‌కుడు మహేంద్ర సింగ్ ధోనీ జూలై 7న తన 44వ జన్మదినం జరుపుకుంటున్నారు. భారత క్రికెట్‌కు తన ప్రత్యేక శైలితో, శాంత స్వభావంతో, అద్భుత నాయకత్వ నైపుణ్యంతో ఎన్నో గెలుపులు అందించిన ధోనీకి ఈరోజు దేశవ్యాప్తంగా అభిమానుల నుంచి విషెష్ లు వెల్లువెత్తుతున్నాయి. ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌ను కదిలించినా.. ధోనీ బర్త్‌డే విషెస్‌ (Dhoni Birthday Wishes) కు సంబంధించిన పోస్టులే కనిపిస్తున్నాయి. స్టార్ స్పోర్ట్స్ సైతం ధోనీ కోసం ప్రత్యేకంగా ఓ వీడియోను రూపొందించి విషెస్ తెలియజేసింది. ధోనీ అంటేనే ఓ బ్రాండ్. వికెట్‌కి వెనక ఓ చురుకైన తెలివైన వ్యక్తి, బ్యాటింగ్‌లో క్రిస్టల్ క్లియర్ ఫినిషింగ్ టచ్ ఉన్న ఆటగాడు, నాయకత్వంలో తక్కువ మాటలు ఎక్కువ చర్యలతో పనిచేసే కెప్టెన్. ఆయన క్రికెట్ కెరీర్‌లోని ప్రస్థానం ఎంతో మందికి ప్రేరణగా నిలిచింది.

సింపుల్‌గా

మరోవైపు ధోనీ బర్త్‌డే సెలెబ్రేషన్స్‌ను హంగామాగా ఏం చేసుకోడు. ఈ సారి కూడా తన స్నేహితుల సమక్షంలోనే కేక్ కట్ చేసి బర్త్డే సెలెబ్రేషన్స్‌ (Birthday Celebrations) ను ముగించాడు. కనీసం ఫ్యామిలీ మెంబర్స్ లేకుండా చిన్ననాటి స్నేహితుల మధ్య సింపుల్‌గా బర్త్‌డే వేడుకలు జరుపుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ఈ వీడియోలో ధోనీ స్లీవ్‌లెస్ బనియన్, షార్ట్స్‌లో ఉన్నాడు. స్నేహితులకు కేక్ తినిపించి వారి శుభాకాంక్షలు అందుకున్నాడు. భారత దిగ్గజ కెప్టెన్‌గా ఎదిగినా.. కోట్ల డబ్బులు ఆర్జించినా ధోనీ తన చిన్ననాటి స్నేహితులను మరిచిపోలేదు. సింపుల్‌గా జీవించేందుకు ఇష్టపడే ధోనీ (MS Dhoni), తన చిన్ననాటి స్నేహితులతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నాడు. ఇందులో కొందర్ని తన వ్యాపార భాగస్వాములుగా మార్చుకున్నాడు.టీమిండియా కెప్టెన్‌గా ధోనీ ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించాడు.

https://twitter.com/i/status/1942074272320749766

పాయింట్స్ టేబుల్‌లో

2007 టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్ 2011, ఛాంపియన్స్ ట్రోఫీ 2013లు గెలిచి మూడు ఐసీసీ టైటిల్స్ గెలిచి ఏకైక కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు. ఐదేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ.. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో అనామక ఆటగాడిగా బరిలోకి దిగిన ధోనీ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. కానీ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) దారుణంగా విఫలమై లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. 44 ఏళ్ల వయసున్న ధోనీ.. వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. అప్పటి కండిషన్స్ బట్టి ఐపీఎల్ ఆడే విషయంపై తుద నిర్ణయం తీసుకుంటానని ధోనీ తెలిపాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: YS Jagan: స్వర్ణ పతక విజేత.. రెడ్డి భవానిని అభినందించిన వైఎస్ జగన్

ధోనీ ప్రత్యేకతలు ఏమిటి?

ఎంతటి ఒత్తిడిలోనైనా ధోనీ ముఖంలో భావాలు కనిపించవు. అతని కూల్ నేచర్‌కు “Captain Cool” అనే బిరుదు వచ్చిందని తెలిసిన విషయమే.ధోనీ మూడూ ప్రధాన ICC ట్రోఫీలను గెలిపించిన ఏకైక కెప్టెన్:2007 T20 వరల్డ్ కప్,2011 వన్డే వరల్డ్ కప్,2013 Champions Trophy.

విరాట్ కోహ్లీ (Virat Kohli) vs మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) – ఎవరు బెస్ట్?

క్లాస్ vs క్లాస్ కాంపారిజన్. వీరిద్దరూ భారత క్రికెట్‌కు అమూల్యమైన రత్నాలు, కానీ వారి స్టైల్, పాత్రలు, గొప్పతనాలు వేర్వేరుగా ఉంటాయి.

Birthday Breaking News dhoni birthday wishes latest news Mahendra Singh Dhoni ms dhoni birthday 2025 ms dhoni turns 44 Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.