📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Vaibhav Suryavanshi: వైభవ్ పై ​ప్రశంసలు కురిపించిన MP శశి థరూర్

Author Icon By Saritha
Updated: December 25, 2025 • 4:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెట్‌లో 14 ఏళ్ల టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్‌పై కేవలం 84 బంతుల్లోనే 190 పరుగులు చేసి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. తాజాగా ఈ యువకెరటం ప్రతిభకు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా ఫిదా అయ్యారు.

Read Also: TG: సన్‌టెక్ ఎనర్జీలో భారీ పెట్టుబడి పెట్టిన సచిన్ టెండూల్కర్

కాంగ్రెస్ ఎంపీ, క్రికెట్ అభిమాని అయిన శశి థరూర్ ఈ కుర్రాడి ప్రతిభపై ప్రశంసలు కురిపించారు. దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌ (Sachin Tendulkar) తో వైభవ్‌ను పోలుస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు. “గతంలో 14 ఏళ్ల వయసులో ఇంతటి అద్భుతమైన ప్రతిభ కనబరిచినప్పుడు, అది సచిన్ టెండూల్కర్. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. మనం ఇంకా దేని కోసం ఎదురుచూస్తున్నాం? వైభవ్‌ (Vaibhav Suryavanshi)ను భారత జట్టులోకి తీసుకోవాలి” అని ఆయన పేర్కొన్నారు.

టీమిండియాలోకి వైభవ్ ఎంట్రీ ఎప్పుడు?

శశి థరూర్ వంటి ప్రముఖులు వైభవ్‌ను వెంటనే భారత జట్టులోకి తీసుకోవాలని కోరుతున్నప్పటికీ, సాంకేతికంగా అది ఇప్పుడు సాధ్యం కాదు. దీనికి కారణం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) పెట్టిన ఒక నిబంధన. 2020లో ఐసీసీ తెచ్చిన నిబంధన ప్రకారం, అంతర్జాతీయ క్రికెట్ ఆడాలంటే ఏ ఆటగాడికైనా కనీసం 15 ఏళ్లు నిండి ఉండాలి.

వైభవ్ ఇప్పుడు 14 ఏళ్ల వయస్సులో ఉన్నాడు. ఆయన 2026, మార్చి 27 నాటికి 15 ఏళ్లు పూర్తి చేసుకుంటాడు. ఆ తర్వాతే సెలక్టర్లు అతడిని సీనియర్ టీమిండియాలోకి ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. వయస్సు చిన్నదైనా, ఆడే తీరులో సీనియర్ల స్థాయిలో ప్రతిభ చూపిస్తున్న వైభవ్ సూర్యవంశీ, భారత క్రికెట్ భవిష్యత్ ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు. 15 ఏళ్లు నిండిన తర్వాత ఈ కుర్రాడు నిజంగానే టీమిండియా జెర్సీ ధరిస్తాడా అనేది చూడాలి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Bihar young cricketer Indian Domestic Cricket latest news Shashi Tharoor tweet Telugu News Vaibhav Suryavanshi Vijay Hazare Trophy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.