అండర్-19 ఆసియా కప్-2025 ఫైనల్లో భారత్ టీమ్ తీరుపై ICCకి కంప్లైంట్ చేయనున్నట్టు PCB, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) చెప్పారు. ఐసీసీ రూల్స్ ప్రకారం రాజకీయాలకు క్రికెటర్లు దూరంగా ఉండాలని, కానీ భారత ఆటగాళ్లు తమ పట్ల అనుచితంగా ప్రవర్తించారని నఖ్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: IND vs NZ: వన్డే, T20 సిరీస్.. జట్లను ప్రకటించిన న్యూజిలాండ్
పాలిటిక్స్, స్పోర్ట్స్‌ను వేరుగా చూడాలి
మైదానంలో కూడా తమ ఆటగాళ్లను తరుచూ రెచ్చగొట్టారని (Mohsin Naqvi) తెలిపారు. పాలిటిక్స్, స్పోర్ట్స్‌ను వేరుగా చూడాలి. ఆదివారం జరిగిన అండర్ 19 ఆసియాకప్ 2025 ఫైనల్లో పాకిస్థాన్ అండర్ 19 టీమ్ 191 పరుగుల భారీ తేడాతో భారత్‌ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ విజయం నేపథ్యంలో సోమవారం ఇస్లామాబాద్‌లో ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్‌ను పాకిస్థాన్ అండర్ 19 టీమ్ కలిసింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మోహ్‌సిన్ నఖ్వీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. భారత ఆటగాళ్ల తీరును తప్పుబట్టాడు.ఫైనల్ అనంతరం మోహ్‌సిన్ నఖ్వీ చేతుల మీదుగా రన్నరప్ మెడల్స్ స్వీకరించేందుకు భారత అండర్ 19 టీమ్ ఆటగాళ్లు నిరాకరించారు. దాంతో ఐసీసీ అసోసియేట్ డైరెక్టర్ ముబష్శిర్ ఉస్మానీ చేతుల మీదుగా భారత ఆటగాళ్లు మెడల్స్ అందుకున్నారు. ఈ ఘటనపై నఖ్వీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రధానితో సమావేశం అనంతరం నఖ్వీ భారత ఆటగాళ్లపై మండిపడ్డాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: