📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Mohit Sharma: అన్ని ఫార్మాట్స్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మోహిత్ శర్మ

Author Icon By Aanusha
Updated: December 4, 2025 • 8:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెటర్ మోహిత్ శర్మ (Mohit Sharma) అన్ని రకాల క్రికెట్‌లకు వీడ్కోలు పలికాడు. చాలా సంవత్సరాలుగా టీమిండియా, ఐపీఎల్‌లో భాగమైన మోహిత్, అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. రాబోయే ఐపీఎల్ మినీ వేలానికి ముందే ఈ నిర్ణయం ప్రకటించాడు. బుధవారం ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా 37 ఏళ్ల మోహిత్ శర్మ తన నిర్ణయాన్ని వెల్లడించాడు.’ఈ రోజు నేను అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నాను.

Read Also: KL Rahul: టీమిండియా ఓటమి.. కెప్టెన్ ఏమన్నాడంటే?

హర్యానాకు ప్రాతినిథ్యం వహించడం నుంచి భారత్ జెర్సీ ధరించి ఐపీఎల్ ఆడేవరకు సాగిన నా ప్రయాణం నాకు దక్కిన వరం.’అని మోహిత్ శర్మ పేర్కొన్నాడు. మోహిత్ శర్మ (Mohit Sharma) రిటైర్మెంట్‌పై తన చివరి ఐపీఎల్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ స్పందించింది. ‘మీ బ్యాక్-ఆఫ్-ది-హ్యాండ్ స్లోయర్ బంతులతో డెత్ ఓవర్లలో బౌలింగ్‌ను విప్లవాత్మకం చేశారు. గొప్ప కెరీర్‌కు అభినందనలు, మోహిత్ భాయ్’ అని ప్రశంసించింది.

View this post on Instagram

A post shared by Mohitmahipal Sharma (@mohitsharma18)

డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌

అంతర్జాతీయ క్రికెట్‌లో మోహిత్ శర్మ సుదీర్ఘ కాలం ఆడకపోయినప్పటికీ బౌలర్‌గా తనదైన ముద్ర వేసుకున్నాడు. హర్యానాతో దేశవాళీ క్రికెట్ కెరీర్ ప్రారంభించిన మోహిత్ శర్మ.. భారత్‌కు కూడా ప్రాతినిథ్యం వహించాడు. కానీ ఐపీఎల్‌ 2013లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మెరుగైన ప్రదర్శన చేయడంతోనే అతనికి గుర్తింపు లభించింది. ముఖ్యంగా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా అతనికి ప్రత్యేక గుర్తింపు ఉంది.

భారత్ తరఫున 2013లో జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌తో మోహిత్ శర్మ అరంగేట్రం చేశాడు. 2015 వన్డే ప్రపంచకప్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. భారత్ తరఫున 26 వన్డేలు ఆడి 31 వికెట్లు, 6 టీ20ల్లో 6 వికెట్లు తీసాడు. 2015లోనే మోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. ఆ తర్వాత అతనికి అవకాశాలు రాలేదు.

చివరిసారిగా అతను సౌతాఫ్రికాతో 2015లో వన్డే మ్యాచ్ ఆడాడు.ఐపీఎల్‌లో మోహిత్ శర్మ చెన్నై సూపర్ కింగ్స్ (2013-2015, 2019), పంజాబ్ కింగ్స్ (2016-2018), ఢిల్లీ క్యాపిటల్స్ (2020), గుజరాత్ టైటాన్స్ (2023-2024) తరఫున ఆడాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్‌లో మొత్తం 120 మ్యాచ్‌లు ఆడిన మోహిత్.. 134 వికెట్లు పడగొట్టాడు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Indian Cricket News international cricket farewell IPL update latest news Mohit Sharma career Mohit Sharma retirement Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.