Mohanlal: టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన చావో రేవో (Do or Die) పోరులో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో సంజూ శాంసన్ తన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజూ, ఆరంభం నుంచే విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
Read Also: IND vs WI: వెస్టిండీస్‌పై అద్భుత విజయం.. సెమీఫైనల్స్‌కు చేరిన భారత్
స్టిండీస్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేయగా, భారత్ ఈ లక్ష్యాన్ని ఐదు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసి ఛేదించింది. భారత విజయంలో సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించాడు. అతను కేవలం 97 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. సంజూ శాంసన్ మెరుపు ఇన్నింగ్స్‌తో టీమ్ ఇండియా ఫైనల్‌లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది.
సంజూ ఇన్నింగ్స్‌పై మోహన్‌లాల్ ప్రశంసల వర్షం
సంజూ మెరుపు ఇన్నింగ్స్‌పై అన్ని వర్గాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ సోషల్ మీడియా వేదికగా సంజూను ప్రత్యేకంగా అభినందించారు. “ఇంత అద్భుత ఫామ్‌లో ఉన్న సంజూను చూడటం ఉత్సాహంగా ఉంది. అతని ఇన్నింగ్స్ నిజంగా మాస్టర్‌ఫుల్. ఇది అతని ప్రతిభ, వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. టీమిండియా సెమీఫైనల్‌కు చేరినందుకు అభినందనలు” అంటూ ట్వీట్ చేశారు. మోహన్‌లాల్ ప్రశంసలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సంజూ శాంసన్ స్వస్థలం కేరళ కావడంతో ఈ ట్వీట్‌కి మరింత ప్రాధాన్యత దక్కుతోంది.
ఇక వెస్టిండీస్‌పై అద్భుత ఇన్నింగ్స్‌తో సంజూ శాంసన్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో విజయవంతమైన ఛేజింగ్ సమయంలో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్‌గా (97*) కొత్త రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు ఈ ఘనత విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. 2022లో పాకిస్థాన్‌పై కోహ్లీ చేసిన 82* పరుగులను సంజూ అధిగమించాడు. అలాగే టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగానూ నిలిచాడు. ఈ జాబితాలో సురేష్ రైనా (101) ముందంజలో ఉన్నాడు.అంతేకాదు అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక అర్ధ శతకాలు చేసిన భారత వికెట్‌కీపర్‌గా కూడా సంజూ మరో మైలురాయి చేరుకున్నాడు. ఇప్పటివరకు ఆరు హాఫ్ సెంచరీలు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: