📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Mohammed Siraj: సిరాజ్ ఫేవరెట్ ఫుడ్ ఏదో తెలుసా!

Author Icon By Anusha
Updated: August 13, 2025 • 12:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మొహమ్మద్ సిరాజ్‌, యువ ఫాస్ట్ బౌలర్, తన కృషి, పట్టుదల, ఫిట్‌నెస్‌తో భారత క్రికెట్‌లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. తాజాగా ఇంగ్లండ్ పర్యటనలో ఆయన ప్రదర్శన చూసినవారు అందరూ ఆశ్చర్యపోయారు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఐదింటిలోనూ ఆడి, మొత్తం 23 వికెట్లు తీశాడు. ఎక్కువగా బౌలింగ్ చేసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అంతటి శ్రమ ఉన్నా, ఒక్కసారి కూడా ఫిట్‌నెస్ సమస్యలు తలెత్తలేదు. ఇది ఆయన కఠినమైన ఫిట్‌నెస్ రూటీన్, క్రమశిక్షణకు నిదర్శనం.సిరాజ్‌ బౌలింగ్ శైలి, మైదానంలో అతని ఎనర్జీ ప్రత్యేకంగా నిలుస్తాయి. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) చేతికి బంతి అందించిన ప్రతీసారి ఆయన 100 శాతం శ్రమ పెట్టి బౌలింగ్ చేస్తాడు. స్వింగ్, సీమ్ బౌలింగ్‌లో నైపుణ్యం కలిగి ఉండడం వల్ల కీలక సందర్భాల్లో వికెట్లు తీసి మ్యాచ్‌ను టీమిండియా వైపు తిప్పగలడు. ఈ సిరీస్‌లోనూ అదే జరిగింది. ఇంగ్లండ్ బ్యాటర్లు కంగారు పడేలా అద్భుతమైన లెంగ్త్, లైన్‌తో బౌలింగ్ చేశాడు.

మానసిక సంతృప్తి

ఇక సిరాజ్ ఫిట్‌నెస్ సీక్రెట్‌ను ఇటీవల భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ దిగ్గజం మహమ్మద్ అజారుద్దీన్ వెల్లడించారు. సిరాజ్ (Mohammed Siraj) ఫిట్‌నెస్‌కు ముఖ్య కారణం ఆయనకు ఇష్టమైన ఆహారం అని అజారుద్దీన్ చిరునవ్వుతో చెప్పారు. ముఖ్యంగా “నల్లి ఘోస్ట్ బిర్యానీ” అంటే ఆయనకు పిచ్చి. ఇది ములుగు బొక్కల మాంసంతో తయారయ్యే ప్రత్యేక బిర్యానీ. అదేవిధంగా మటన్ పాయ కూడా ఆయన ఫేవరెట్. ఈ వంటకాల వల్ల సిరాజ్ శరీరానికి కావాల్సిన శక్తి, ప్రోటీన్లు లభిస్తాయని, అలాగే మానసిక సంతృప్తి కూడా కలుగుతుందని అజారుద్దీన్ అభిప్రాయపడ్డారు.ఇంగ్లండ్ పర్యటనలో సిరాజ్ అద్భుతంగా రాణించాడు. మూలుగు బొక్కల బిర్యానీ, పాయా పుణ్యమా అతను ఫిట్‌గా మారాడు. ముఖ్యంగా అతని కాళ్లు మరింత బలంగా మారాయి. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో సిరాజ్ చాలా ఉత్సాహంగా బౌలింగ్ చేశాడు. సిరీస్ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబర్చాలనే తపన, జట్టుకు విజయాన్నందించాలనే కసి అతనిలో కనిపించింది.

Mohammed Siraj

సిరాజ్ ఓ నయా సూపర్ స్టార్

ఓవల్ వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్‌లో అతను వేసిన స్పెల్ అమోఘం. జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) గైర్హాజరీలో బౌలింగ్ బాధ్యతలను అతను గొప్పగా స్వీకరించాడు. ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. చాలా పట్టుదలతో బౌలింగ్ చేశాడు. భారత క్రీడల్లో సిరాజ్ ఓ నయా సూపర్ స్టార్’అని అజారుద్దీన్ ప్రశంసించాడు.ఈ ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను టీమిండియా 2-2తో సమం చేసుకున్న విషయం తెలిసిందే. ఆఖరి రోజు వరకు ఉత్కంఠగా సాగిన చివరి టెస్ట్‌లో మహమ్మద్ సిరాజ్ అసాధారణ ప్రదర్శనతో టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్నందించిన విషయం తెలిసిందే. ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు అవసరం కాగా.. టీమిండియా గెలుపునకు నాలుగు వికెట్లు కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో సిరాజ్ మూడు వికెట్లు తీసి భారత్ సంచలన విజయాన్నందించాడు.

సిరాజ్ ఏ రాష్ట్రానికి చెందినవారు?

ఆయన తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌కు చెందినవారు.

సిరాజ్ ప్రత్యేకత ఏమిటి?

పొడవైన స్పెల్స్‌లో స్థిరంగా బౌలింగ్ చేయడం, స్వింగ్, సీమింగ్ డెలివరీలతో వికెట్లు తీయడంలో నైపుణ్యం కలిగి ఉండటం.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/suresh-raina-suresh-raina-appeared-before-the-ed-investigation/crime/529749/

Breaking News Cricket News hyderabad dsp India Tour of England India vs England Test series latest news Mohammed Siraj Shubman Gill team india fast bowler

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.