📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన

Latest News: Ruturaj Gaikwad: రుతురాజ్ పై మహమ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు

Author Icon By Anusha
Updated: November 19, 2025 • 4:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టులో కెప్టెన్సీ మార్పులపై టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ (Mohammad Kaif) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. టీమిండియా దిగ్గజం, సీఎస్‌కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జట్టులో ఉన్నన్ని రోజులు రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) పేపర్ కెప్టెనే అని స్పష్టం చేశాడు. ధోనీ కెప్టెన్‌గా లేకపోయినా జట్టుపై పూర్తి ఆధిపత్యం అతనిదే ఉంటుందన్నాడు.

Read Also: Puttaparthi: సత్యసాయి నుంచి నేను ఎంతో నేర్చుకున్నా: సచిన్ టెండూల్కర్

ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్‌కు ముందు సీఎస్‌కే తమ జట్టును ప్రక్షాళన చేసేందుకు సిద్దమైంది. రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా 10 మంది ఆటగాళ్లను సీఎస్‌కే వేలంలోకి వదిలేసింది. ఆటగాళ్ల స్వాప్ ట్రేడ్ డీల్‌‌తో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, సామ్ కరణ్‌ను రాజస్థాన్ రాయల్స్‌కు ఇచ్చేసి ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్‌ను టీమ్‌లోకి తెచ్చుకుంది.

సంజూ శాంసన్‌ (Sanju Samson) జట్టులోకి వచ్చినా తమ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అని సీఎస్‌కే ప్రకటించింది.సీఎస్‌కే టీమ్ గురించి తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘సీఎస్‌కే టీమ్‌లో ధోనీ పాత్ర ఇంపాక్ట్ ప్లేయర్ కంటే ఎక్కువ. అతను కేవలం బ్యాటింగ్ మాత్రమే చేయడు. షాడో కెప్టెన్‌గా జట్టును నడిపిస్తాడు. ఆటగాళ్లకు గైడెన్స్ ఇస్తాడు.

Ruturaj Gaikwad: Mohammed Kaif’s sensational comments on Ruturaj

ధోనీ మైదానంలో ఉన్నంత వరకు అతనే సారథి

రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) కెప్టెన్‌గా ఉన్నప్పటికీ అతను కూడా ధోనీ సూచనలనే పాటిస్తాడు. పేపర్‌‌పై రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ కావచ్చు. కానీ ధోనీ మైదానంలో ఉన్నంత వరకు అతనే సారథిగా వ్యవహరిస్తాడు. ధోనీ ఏం చేయగలడనే విషయంపై ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ధోనీ కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే ఆడడు.’అని కైఫ్ స్పష్టం చేశాడు.ఐపీఎల్ 2025 సీజన్‌లో ధోనీ కేవలం వికెట్ కీపర్‌గానే కొనసాగాడు.

బ్యాటింగ్‌లో కూడా చివర్లో బరిలోకి దిగాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో జట్టుకు దూరమైతే.. ధోనీనే జట్టును నడిపించాడు. కానీ సీఎస్‌కే (CSK) ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. అప్‌కమింగ్ సీజన్‌లోనూ 44 ఏళ్ల ధోనీ వికెట్ కీపర్ పాత్రనే పోషించే అవకాశం ఉంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

CSK Dhoni IPL 2026 latest news Mohammad Kaif comments Ruturaj Gaikwad Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.