📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: BCCI: బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్

Author Icon By Anusha
Updated: September 28, 2025 • 3:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) కొత్త అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్ (Mithun Manhas) నియమితులయ్యారు. ఆదివారం ముంబైలోని బీసీసీఐ కార్యాలయంలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాజీవ్ శుక్లా (Rajiv Shukla) ను బోర్డు ఉపాధ్యక్షుడిగా ప్రకటించారు. క్రికెట్ పరిపాలనలో ఈ మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది.

Asia Cup 2025: ఆసియా కప్ చరిత్రలో తొలిసారి దాయాదుల మధ్య తుది సమరం

సౌరవ్ గంగూలీ, రోజర్ బిన్నీల తర్వాత ఈ అత్యున్నత పదవిని అలంకరించిన మూడో మాజీ క్రికెటర్‌గా 45 ఏళ్ల మన్హాస్ నిలిచారు.గత ఆగస్టు నెలలో రోజర్ బిన్నీ తన పదవికి రాజీనామా చేయడంతో బీసీసీఐ అధ్యక్ష పదవి ఖాళీ అయింది.

అప్పటి నుంచి రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మిథున్ మన్హాస్ పేరును జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (జేకేసీఏ) నామినేట్ చేసింది. అతడి పేరు అనూహ్య రీతిలో తెరపైకి వచ్చింది. ఇటీవల బోర్డు సమావేశం అనంతరమే మిథున్ మన్హాస్ కూడా ఈ రేసులోకి వచ్చాడు.

BCCI

ఏజీఎంలో ఆయన ఎన్నికను ఖరారు చేశారు

తాజాగా ఏజీఎం (AGM) లో ఆయన ఎన్నికను ఖరారు చేశారు.ఇదే సమావేశంలో ఇతర కీలక పదవులకు కూడా ఎన్నికలు జరిగాయి. సమాచారం ప్రకారం, వైస్ ప్రెసిడెంట్‌గా రాజీవ్ శుక్లా, కార్యదర్శిగా దేవాజిత్ సైకియా తమ పదవులను నిలబెట్టుకున్నారు. సంయుక్త కార్యదర్శిగా ప్రభ్‌తేజ్ సింగ్ భాటియా, కోశాధికారిగా రఘురామ్ భట్ కొత్తగా ఎన్నికయ్యారు.

మిథున్ మన్హాస్ నియామకంపై కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ (Jitendra Singh) ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా హర్షం వ్యక్తం చేశారు. “ఇది ఒక చారిత్రక సందర్భం! జమ్మూకశ్మీర్‌లోని మారుమూల ప్రాంతమైన దోడా జిల్లాకు చెందిన మిథున్ మన్హాస్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికవడం గర్వకారణం” అని ఆయన పేర్కొన్నారు.

జమ్మూకశ్మీర్ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించి కోచ్‌గా సేవలు

ఢిల్లీ తరఫున దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డు ఉన్న మన్హాస్, ఆ తర్వాత జమ్మూకశ్మీర్ జట్టు (Jammu and Kashmir team) కు కూడా ప్రాతినిధ్యం వహించి కోచ్‌గా సేవలు అందించారు. తన కెరీర్‌లో 147 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి 9,714 పరుగులు చేశారు.

ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, పుణె వారియర్స్ ఇండియా, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ఆడారు. క్షేత్రస్థాయిలో క్రికెట్‌పై ఉన్న అవగాహన, సౌమ్యుడిగా పేరున్న మన్హాస్ నియామకం భారత క్రికెట్‌కు మేలు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

BCCI AGM 2025 bcci leadership change bcci new president Breaking News Indian Cricket Board News latest news mithun manhas bcci mithun manhas elected rajiv shukla vice president Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.