📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Mitchell Starc: అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

Author Icon By Anusha
Updated: December 4, 2025 • 5:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఎడమచేతివాటం బౌలర్‌గా అగ్రస్థానంలో నిలిచాడు.. పాకిస్థాన్ పేస్ దిగ్గజం వసీం అక్రమ్ పేరిట దశాబ్దాలుగా ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.. ఇంగ్లండ్‌తో బ్రిస్బేన్‌లో గురువారం ప్రారంభమైన యాషెస్ రెండో టెస్టు తొలి రోజు ఆటలో స్టార్క్ (Mitchell Starc) ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు.

Read Also: Dewald Brevis: డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

Mitchell Starc is the left-arm bowler with the most wickets

స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేసాడు

ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ (31)ను రెండో స్లిప్‌లో స్టీవ్ స్మిత్ క్యాచ్ ద్వారా ఔట్ చేసి స్టార్క్ తన 415వ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.దీంతో 414 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్న వసీం అక్రమ్‌ను వెనక్కి నెట్టాడు. విశేషమేమిటంటే, స్టార్క్ తన 102వ టెస్టులోనే ఈ మైలురాయిని చేరుకోగా, అక్రమ్ 104 టెస్టుల్లో 414 వికెట్లు తీశాడు. ప్రస్తుతం ఆల్-టైమ్ వికెట్ టేకర్ల జాబితాలో 16వ స్థానంలో ఉన్న స్టార్క్,

ఇదే మ్యాచ్‌లో హర్భజన్ సింగ్ (417), షాన్ పొలాక్ (421) రికార్డులను కూడా అధిగమించే అవకాశం ఉంది. ఈ పింక్ బాల్ టెస్టులో ఆరంభంలోనే స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. బెన్ డకెట్ (0), ఓల్లీ పోప్ (0)లను పెవిలియన్‌కు పంపాడు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

latest news Left Arm Fast Bowler mitchell starc Telugu News test cricket record Wasim Akram Record

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.