📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Mitchell Marsh : ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ నాయకత్వం

Author Icon By Sai Kiran
Updated: October 7, 2025 • 4:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Mitchell Marsh : మిచెల్ మార్ష్ భారత్‌తో సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్లు ప్రకటించాయి – కమిన్స్‌కు విశ్రాంతి, మార్ష్ కెప్టెన్‌గా, భారత్‌తో త్వరలో ప్రారంభం కానున్న పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియా తమ వన్డే, టీ20 జట్లను ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు విశ్రాంతి ఇచ్చడంతో ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ (Mitchell Marsh) ఈ సిరీస్‌లకు నాయకత్వం వహించనున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు. పలువురు సీనియర్ ఆటగాళ్లకు సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు, గాయం కారణంగా టీ20లకు గ్లెన్ మ్యాక్స్‌వెల్ అందుబాటులో లేరు.

వన్డే సిరీస్ :

అక్టోబర్ 19న పెర్త్‌లో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. స్టార్క్‌కు ఇది సీజన్‌లో తొలి అంతర్జాతీయ సిరీస్. గత దక్షిణాఫ్రికా పర్యటనకు పనిభారం కారణంగా అతను దూరంగా ఉన్నాడు. గాయాల నుంచి కోలుకున్న మాథ్యూ షార్ట్, మిచెల్ ఓవెన్, మాథ్యూ రెన్షా కూడా వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు. గత సిరీస్‌లో ఆడిన మార్నస్ లబుషేన్, సీన్ అబాట్, ఆరోన్ హార్డీ ఈసారి జట్టులో లేరు. నవంబర్ 21న ప్రారంభమయ్యే యాషెస్ సిరీస్‌కు పూర్తి ఫిట్‌నెస్‌తో సిద్ధం కావడానికి కమిన్స్‌కు విశ్రాంతి ఇచ్చారు.

టీ20 సిరీస్:

జోష్ ఇంగ్లిస్, నాథన్ ఎల్లిస్ తిరిగి టీ20 జట్టులో చేరారు. అయితే గ్లెన్ మ్యాక్స్‌వెల్ మణికట్టు గాయంతో అందుబాటులో లేరు. టీ20 ప్రపంచకప్, స్వదేశంలో టెస్ట్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని ఆటగాళ్ల పనిభారాన్ని సమన్వయం చేసేందుకు కేవలం రెండు మ్యాచ్‌ల కోసం జట్టును ప్రకటించారు. అనుభవం మరియు యువత కలయికతో జట్లను ఎంపిక చేసినట్లు సెలక్షన్ ఛైర్మన్ జార్జ్ బెయిలీ తెలిపారు.

Read also : స్థానిక సంస్థల్లో BCలకు 34% కోటాపై CBN ఆదేశాలు

ఆస్ట్రేలియా వన్డే జట్టు:

మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ క్యారీ, కూపర్ కొన్నోలీ, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ ఓవెన్, మాథ్యూ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.

ఆస్ట్రేలియా టీ20 జట్టు (తొలి రెండు మ్యాచ్‌ల కోసం):

మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, టిమ్ డేవిడ్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కునెమాన్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.

Read Hindi News : Hindi vaartha

Epaper : epaper.vaartha.com

Read also :

Australia Cricket Team Australian cricket news Breaking News in Telugu Cricket Australia selection Glenn Maxwell injury Google News in Telugu India series 2025 Latest News in Telugu Mitchell Marsh Mitchell Stark comeback ODI squad Australia Pat Cummins rest T20 squad Australia Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.