ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Messi) త్వరలోనే హైదరాబాద్ నగరానికి రానుండడంతో ప్రస్తుతం అందరి దృష్టి అటు వైపే ఉంది. ఈ నెల 13వ తేదీన అంటే శనివారం రోజున మెస్సీ (Messi) హైదరాబాద్ నగరంలో పర్యటించనుండడంతో క్రీడాభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో 13వ తేదీ సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన ఫ్రెండ్లీ ఫుడ్‌బాల్ మ్యాచ్ ఆడనున్నారు.
Read Also: Ro-Ko: వన్డే ర్యాంకింగ్స్‌లో రో-కో సత్తా
భారీ బందో బస్తు ఏర్పాటు
ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోభస్తు ఏర్పాటు చేశారు.ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా అభిమానులు వచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో రాచకొండ సీపీ సుదీర్ బాబు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు కేవలం పాసులు ఉన్న అభిమానులు మాత్రమే రావాలని.. పాస్ లేకుంటే ఎంట్రీ లేదని స్పష్టం చేశారు.
టికెట్, పాసులు ఉన్న వారు మాత్రమే స్టేడియం వద్దకు రావాలని, వారికి మాత్రమే అనుమతి ఉంటుందని.. మిగతా వారికి ఎట్టి పరిస్థితి లో అనుమతి ఉండదని సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఈ నెల 13న జరుగుతున్న ఈ మ్యాచ్ కు అత్యంత కట్టుదిట్టమైన, భారీ బందో బస్తును ఏర్పాటు చేసినట్లు సీపీ పేర్కొన్నారు. ఇందుకు అభిమానులు కూడా సహకరించాలని ఆయన కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: