📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్

Latest News: Messi: కోల్‌కతాలో మెస్సీ ఈవెంట్.. ప్రధాన నిర్వాహకుడు అరెస్ట్

Author Icon By Anusha
Updated: December 13, 2025 • 4:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ (Messi) కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. కోల్‌కతాలో మెస్సీ టూర్ సందర్భంగా సాల్ట్ లేక్ స్టేడియం వద్ద ఆయన అభిమానులు అదుపు తప్పి భద్రతా వలయాలను ఛేదించుకుని వచ్చి స్టేడియంలో విధ్వంసం సృష్టించారు. వేలకు వేలు పోసి టికెట్లు కొన్నా తమ అభిమాన ఆటగాడిని సరిగ్గా చూడలేకపోయామంటూ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిర్వాహకుడు శతద్రు దత్తను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read Also: Messi: కోల్‌కతాలో ఉద్రిక్తత.. HYDలో పోలీసుల అలర్ట్

వాటర్ బాటిళ్లు విసరడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది

వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాలోని యువ భారతి క్రీడాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. రూ.5,000 నుంచి రూ.25,000 వరకు వెచ్చించి అభిమానులు టికెట్లు కొనుగోలు చేశారు. అయితే, మెస్సీ (Messi) చుట్టూ భద్రతా సిబ్బంది, ఇతర అతిథులు ఉండటంతో స్టాండ్స్‌లో ఉన్న వారికి అతను స్పష్టంగా కనిపించలేదు. దీంతో ఆగ్రహానికి గురైన ఫ్యాన్స్ కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసరడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Messi event in Kolkata.. main organizer arrested

పరిస్థితి అదుపు తప్పుతుండటంతో నిర్వాహకులు మెస్సీని హుటాహుటిన అక్కడి నుంచి తీసుకెళ్లారు. వాస్తవానికి మెస్సీ స్టేడియంలో ఒక రౌండ్ వేయాల్సి ఉన్నా, గందరగోళం కారణంగా అది సాధ్యపడలేదు. అతను ఉదయం 11:15 గంటలకు వేదిక వద్దకు వచ్చి కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉన్నారు. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, ప్రధాన నిర్వాహకుడైన శతద్రు దత్తను అరెస్ట్ చేశామని ఏడీజీ (శాంతిభద్రతలు) జావేద్ షమీమ్ ధృవీకరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

football fans chaos Kolkata unrest latest news Lionel Messi Messi Kolkata tour Salt Lake Stadium Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.