📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Messi: కోల్‌కతాలో మెస్సీ ఈవెంట్.. స్పందించిన AIFF

Author Icon By Aanusha
Updated: December 13, 2025 • 8:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కోల్‌కతాలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Messi) పాల్గొన్న కార్యక్రమంలో చోటుచేసుకున్న గందరగోళం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిర్వాహణ లోపాలపై అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) (AIFF) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఇది పూర్తిగా ఒక ప్రైవేట్ ఏజెన్సీ నిర్వహించిన కార్యక్రమమని, దీని గురించి తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తేల్చిచెప్పింది.

Read Also:  Messi: హైదరాబాద్‌లో మెస్సి..షెడ్యూల్ ఇదే..!

తమకు ఎలాంటి సంబంధం లేదని

“వివేకానంద యువ భారతి క్రీడాంగణంలో జరిగిన పరిణామాలపై మేము తీవ్ర ఆందోళన చెందుతున్నాము. ఇది ఒక ప్రైవేట్ పీఆర్ ఏజెన్సీ నిర్వహించిన కార్యక్రమం. దీని ప్రణాళిక, నిర్వహణ లేదా అమలులో ఏఐఎఫ్ఎఫ్‌కు ఎలాంటి పాత్ర లేదు. ఈ కార్యక్రమ వివరాలను మాకు తెలియజేయలేదు, మా నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు” అని ఏఐఎఫ్ఎఫ్ సోషల్ మీడియాలో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AIFF Statement Football India Kolkata Event latest news Lionel Messi Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.