కోల్‌కతాలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Messi) పాల్గొన్న కార్యక్రమంలో చోటుచేసుకున్న గందరగోళం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిర్వాహణ లోపాలపై అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) (AIFF) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఇది పూర్తిగా ఒక ప్రైవేట్ ఏజెన్సీ నిర్వహించిన కార్యక్రమమని, దీని గురించి తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తేల్చిచెప్పింది.
Read Also: Messi: హైదరాబాద్‌లో మెస్సి..షెడ్యూల్ ఇదే..!
తమకు ఎలాంటి సంబంధం లేదని
“వివేకానంద యువ భారతి క్రీడాంగణంలో జరిగిన పరిణామాలపై మేము తీవ్ర ఆందోళన చెందుతున్నాము. ఇది ఒక ప్రైవేట్ పీఆర్ ఏజెన్సీ నిర్వహించిన కార్యక్రమం. దీని ప్రణాళిక, నిర్వహణ లేదా అమలులో ఏఐఎఫ్ఎఫ్‌కు ఎలాంటి పాత్ర లేదు. ఈ కార్యక్రమ వివరాలను మాకు తెలియజేయలేదు, మా నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు” అని ఏఐఎఫ్ఎఫ్ సోషల్ మీడియాలో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: