📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు

2025 Goals Race: అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా మెస్సీ

Author Icon By Anusha
Updated: January 2, 2026 • 11:19 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇరవై సంవత్సరాలకు పైగా ప్రపంచ ఫుట్‌బాల్‌లో అగ్రస్థానంలో కొనసాగిన క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీ ఇప్పటికీ ఎలైట్ ఆటగాళ్లుగానే నిలుస్తున్నారు. 2025 (2025 Goals Race) క్యాలెండర్ ఇయర్‌లో మెస్సీ మరోసారి ముందంజలో నిలిచాడు. గోల్స్ పరంగా చూస్తే, గత ఏడాది అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో మెస్సీ ముందు నిలిచాడు. గతేడాది మొత్తం మీద మెస్సీ 46 గోల్స్ చేయగా, రొనాల్డో 41 గోల్స్‌తో సరిపెట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, లియోనెల్ మెస్సీ అమెరికాలోని తన క్లబ్ ‘ఇంటర్ మయామి’ తరఫున 43 గోల్స్, తన దేశం అర్జెంటీనా తరఫున 3 గోల్స్ సాధించాడు.

Read also: Usman Khawaja: రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్

మరోవైపు, క్రిస్టియానో రొనాల్డో సౌదీ అరేబియా క్లబ్ ‘అల్-నసర్’ కోసం 33 గోల్స్, పోర్చుగల్ జాతీయ జట్టుకు 8 గోల్స్ అందించాడు. రొనాల్డో గోల్స్ సంఖ్యపై కొన్ని నివేదికల్లో 40 అని పేర్కొన్నప్పటికీ, చాలా క్రీడా సంస్థలు ఆయన 41 గోల్స్ (2025 Goals Race) చేసినట్లు నిర్ధారించాయి.కేవలం గోల్స్ చేయడమే కాకుండా, గోల్స్ చేయించడంలోనూ (అసిస్ట్‌లు) మెస్సీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.

Messi becomes the player with the most goals

2025లో మెస్సీ ఏకంగా 28 అసిస్ట్‌లు అందించగా, రొనాల్డో కేవలం 4 అసిస్ట్‌లతో వెనుకబడ్డాడు. అయితే, రొనాల్డో తన కెరీర్‌లో ఓ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో 40కి పైగా గోల్స్ చేయడం ఇది 14వ సారి కావడం విశేషం.మొత్తం మీద, తమ కెరీర్ చరమాంకంలోనూ కొత్త లీగ్‌లలో సత్తా చాటుతూ ఈ ఇద్దరు దిగ్గజాలు అభిమానులను అలరిస్తూనే ఉన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

2025 Goals Cristiano Ronaldo Football Records latest news Lionel Messi Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.