📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్

Latest News: Matheesha Pathirana: CSKకి మతీశ పతిరణ‌ భావోద్వేగ వీడ్కోలు

Author Icon By Anusha
Updated: December 17, 2025 • 11:06 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐపీఎల్ 2026 మినీ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ శ్రీలంక స్టార్ బౌలర్, ‘బేబీ మలింగ’గా పిలవబడే మతీషా పతిరానా (Matheesha Pathirana) ను ఏకంగా రూ. 18 కోట్లకు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. రూ. 2 కోట్ల బేస్ ధరతో వేలంలోకి వచ్చిన పతిరానా కోసం జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గత కొన్ని సీజన్లుగా సీఎస్‌కే బౌలింగ్‌కు వెన్నెముకగా నిలిచిన పతిరణ‌,

Read Also:  Aman Rao: ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక

2023లో జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, గత సీజన్‌లో ఫామ్ కోల్పోవడం, గాయాల బారిన పడటంతో సీఎస్‌కే (CSK) అతడిని వేలానికి విడుదల చేసింది. సీఎస్‌కే తరఫున నాలుగు సీజన్లలో 32 మ్యాచ్‌లు ఆడిన పతిరణ‌, మొత్తం 47 వికెట్లు పడగొట్టాడు. అయితే, ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు మతీషా పతిరానా (Matheesha Pathirana), తన పోస్టులో “సీఎస్‌కే నాకు క్రికెట్ కంటే ఎక్కువే ఇచ్చింది.

View this post on Instagram

A post shared by MATHEESHA PATHIRANA (@matheesha.pathirana_99)

నాపై నమ్మకం ఉంచిన యాజమాన్యానికి ఎప్పటికీ రుణపడి ఉంటా

నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఓ కుటుంబాన్ని అందించింది. నా చివరి సీజన్‌ను ఘనంగా ముగించి, ఫ్రాంచైజీ తరఫున 50 వికెట్ల మైలురాయిని అందుకోవాలని చాలా ఆశపడ్డాను.కానీ, దురదృష్టవశాత్తు అది జరగలేదు” అని ఆవేదన వ్యక్తం చేశాడు. “నాపై నమ్మకం ఉంచిన ధోనీ భాయ్‌కు, కాశీ సర్‌కు, యాజమాన్యానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. చెన్నై నా ఇల్లు లాంటిది.

నా సోదరుల్లాంటి సహచరులకు, కష్టసుఖాల్లో నాకు అండగా నిలిచిన అభిమానులకు నా ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. చెన్నైకి నా హృదయంలో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. గౌరవంతో, కృతజ్ఞతతో ఈ ప్రయాణాన్ని ముగించి.. కేకేఆర్‌తో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను” అని పతిరణ‌ తన పోస్టులో రాసుకొచ్చాడు.

మతీషా పతిరానా ఐపీఎల్‌లో ఎప్పుడు అడుగుపెట్టాడు?

మతీషా పతిరానా 2022 ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున ఐపీఎల్‌లోకి ప్రవేశించాడు.

ఐపీఎల్‌లో పతిరానా మొదటి మ్యాచ్ ఎప్పుడు ఆడాడు?

2022 ఐపీఎల్ సీజన్‌లోనే పతిరానా తన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Chennai Super Kings CSK IPL News latest news Matheesha Pathirana Sri Lanka fast bowler Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.