📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

షూటర్ మను భాకర్ ఇంట విషాదం

Author Icon By Sudheer
Updated: January 19, 2025 • 4:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రముఖ క్రీడాకారిణి మను భాకర్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం హర్యానాలోని మహేంద్రగఢ్ బైపాస్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మను భాకర్ అమ్మమ్మ, మామ చనిపోయారు. వారు ప్రయాణిస్తున్న బ్రెజ్జా కారు ఓ స్కూటీని ఢీ కొట్టడంతో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘోర ప్రమాదంలో మను భాకర్ అమ్మమ్మ, మామ స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాద సమయంలో కారును డ్రైవర్ నడుపుతున్నాడని, ప్రమాదం తర్వాత కారును అక్కడే వదిలేసి పారిపోయాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఈ సంఘటనతో మను భాకర్ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. మను భాకర్ ఇటీవలే తన అద్భుతమైన ప్రదర్శనతో క్రీడా ప్రపంచంలో గుర్తింపు పొందారు. పారిస్‌లో గతేడాది జరిగిన ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలుచుకొని దేశానికి గౌరవం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయాలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆమెను ఖేల్ రత్న అవార్డుతో సత్కరించింది.

రెండు రోజుల క్రితమే మను భాకర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఖేల్ రత్న అవార్డు స్వీకరించారు. ఈ ఆనంద సమయంలో మను ఇంట్లో ప్రమాదం జరగడం, అమ్మమ్మ, మామలను కోల్పోవడం ఆమెను విషాదంలో పడేసింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా పలువురు క్రీడా ప్రియులు, మను అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Google news grandmother haryana Manu Bhaker Road Accident uncle died

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.