📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Manik Gupta: తేనెటీగల దాడిలో అంపైర్ మృతి

Author Icon By Aanusha
Updated: February 20, 2026 • 12:06 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Manik Gupta: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిన అండర్-13 క్రికెట్ మ్యాచ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. కాన్పూర్ క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన అంపైర్ మణిక్ గుప్తా(65) తేనెటీగల దాడిలో మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు ఆటగాళ్లతో పాటు మరో అంపైర్ గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.అండర్ 13 మ్యాచ్ జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆకస్మాత్తుగా మైదానంలో ఉన్నవారిపై తేనెటీగల దాడి చేయడంతో స్టేడియంలో గందరగోళం నెలకొంది.

Read Also: Supreme Court – Shami: క్రికెటర్ షమీకి సుప్రీంకోర్టు నోటీసులు

పలువురు ఆటగాళ్లకు గాయాలు

ఆటగాళ్లు, ప్రేక్షకులు ప్రాణభయంతో పరుగులు తీసారు. ఆటగాళ్లు చిన్నపిల్లలు కావడంతో వారు త్వరగా తప్పించుకోగలిగారు. కానీ 65 ఏళ్ల మణిక్ గుప్తా త్వరగా పరుగెత్తలేక తీవ్ర గాయాలపాలయ్యారు.ఆయనను ముందుగా స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కానీ పరిస్థితి విషమించడంతో మరో ఆసుపత్రికి తరిలించారు.

Manik Gupta: Umpire dies in bee attack

కానీ చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. గుప్తా శరీరంపై వందలాది చోట్ల తేనెటీగలు కుట్టడంతో విషం శరీరమంతా పాకి ‘అనాఫిలాక్టిక్ షాక్’గురై మృతి చెందారని వైద్యులు పేర్కొన్నారు. మరో అంపైర్ జగదీశ్ శర్మ‌తో సహా పలువురు ఆటగాళ్లు గాయపడ్డారు. మణిక్ గుప్తాకు కాన్పూర్ క్రికెట్ అసోసియేషన్‌తో 30 ఏళ్ల అనుబంధం ఉంది. ఆయన అనేక ప్రాంతీయ మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

latest news Manik Gupta Telugu News UP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.