📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Bharat: మహిళల ట్రై సిరీస్ ఫైనల్‌కు భారత్

Author Icon By Digital
Updated: May 8, 2025 • 4:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Bharat మహిళల ట్రై సిరీస్ ఫైనల్‌కు భారత్: దక్షిణాఫ్రికాపై 23 పరుగుల తేడాతో గెలుపు

వన్డే ట్రై సిరీస్‌లో భారత మహిళల జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ సిరీస్‌లో మూడవ విజయాన్ని అందుకొని ఫైనల్ ‘బెర్త్’ను కన్ఫర్మ్ చేసింది. శ్రీలంక వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్, దక్షిణాఫ్రికా మహిళలతో హోరాహోరీగా పోటీ చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ 23 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది.మొదట బ్యాటింగ్ చేసిన భారత్, జెమీమా రోడ్రిగ్స్ (101 బంతుల్లో 123 పరుగులు, 15 ఫోర్లు, 1 సిక్సర్) మెరుపు సెంచరీ సాధించడంతో పాటు బౌలర్లు సమిష్టిగా రాణించడంతో అలవోకగా గెలిచింది. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 314 పరుగులకు పరిమితమైంది.338 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. లారా గూడాల్‌ను 4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అమన్ జ్యోత్ కౌర్ ఔట్ చేసింది. ఈ దశలో బ్రిట్స్, స్మిత్ రెండో వికెట్‌కు 63 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అప్పుడు భారత్ విజయం ఖాయమన్న సమయంలో, సఫారీ కెప్టెన్ చార్లీ ట్రయాన్ మెరువులు మెరిపించి కౌర్ సేనను భయపెట్టింది. 43 బంతుల్లోనే 67 పరుగులు చేసి మ్యాచ్ చివరికి పోరాడి, 23 పరుగుల తేడాతో భారత్ గెలిచింది.

Bharat: మహిళల ట్రై సిరీస్ ఫైనల్‌కు భారత్

భారత్ మహిళల జట్టు 23 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి ఫైనల్‌లో అడుగు పెట్టింది

మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళలు 337 పరుగుల భారీ స్కోర్ చేశారని చెప్పాలి. ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినా, స్మృతి మందాన, హర్మన్ ప్రీత్ కౌర్ దూకుడుగా బ్యాటింగ్ చేశారు. స్మృతి హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ (93) సౌతాఫ్రికా బౌలర్లను దంచి కొట్టారు. దీప్తి 7 పరుగులతో సెంచరీని కోల్పోయింది. ఐదో వికెట్‌కు 122 పరుగులు జోడించి, జట్టు స్కోర్‌ను 337 పరుగులకు చేర్చారు.ఈ విజయం ద్వారా భారత మహిళల జట్టు ఫైనల్‌కు చేరినందున, ట్రై సిరీస్‌లో వారి ప్రదర్శన శక్తివంతంగా కొనసాగుతోంది.

Read More : India Pakistan War: ఆపరేషన్ సిందూర్.. ఐపీఎల్ కొనసాగేనా?

Deepti Sharma Google news Google News in Telugu India vs South Africa India Women Cricket Jemimah Rodrigues Latest News in Telugu Paper Telugu News South Africa Women Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news Women’s Cricket Women’s Tri Series

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.