Maharashtra: క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

Read Time:  1 min
Maharashtra: క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
FONT SIZE
GET APP

దేశంలోని క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు (Supreme Court) మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. కనీసం బ్యాట్ పట్టుకోవడం కూడా తెలియని వారు సంఘాలను నడపడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. క్రీడాకారులే సంఘాలను నిర్వహించాలని స్పష్టం చేసింది. గత నెల, 6న ఎంసీఏ (Maharashtra) ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఎన్నికల ముందు దాదాపు 401 మందిని కొత్తగా సభ్యులుగా చేర్చడం ద్వారా ఓటర్ల జాబితాను తారుమారు చేస్తున్నారని ఆరోపిస్తూ మాజీ క్రికెటర్‌, బీజేపీ నేత కేదార్ జాదవ్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

Read Also: Cricket politics controversy : ‘పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం!

Supreme Court's key comments on the governance of sports associations
Supreme Court’s key comments on the governance of sports associations

బ్యాట్ పట్టుకోవడం రానివారు క్రికెట్ సంఘాలను నడుపుతారా?

కొత్తగా చేర్చిన సభ్యుల్లో చాలామంది ఎన్‌సీపీ – ఎస్‌పీ ఎమ్మెల్యే రోహిత్ పవార్‌కు సమీప బంధువులు, వ్యాపార భాగస్వాములేనని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో బాంబే హైకోర్టు ఎంసీఏ ఎన్నికలపై స్టే విధించింది. దీనిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. రికార్డులను పరిశీలించిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 1986 నుంచి 2023 వరకు ఎంసీఏలో కేవలం 164 మంది సభ్యులు మాత్రమే ఉన్నారని,

ఆ తర్వాత ఒక్కసారిగా సభ్యుల సంఖ్య భారీగా పెరగడంపై 2023 తర్వాత ఏదైనా బంపర్ డ్రా తీశారా? అంటూ సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ పిటిషనర్లను ప్రశ్నించారు. అసోసియేషన్ తన సభ్యత్వాన్ని విస్తరించాలనుకుంటే, ఆ స్థానాలను మాజీ అంతర్జాతీయ క్రికెటర్లకు కేటాయించి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. క్రికెటర్ల వల్లే క్రికెట్ సంఘాలు ఉన్నాయి తప్ప నిర్వాహకుల వల్ల కాదని కోర్టు (Supreme Court) అభిప్రాయపడింది .

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.