📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

LSG Vs MI : గాయం కార‌ణంగా మ్యాచ్‌కు రోహిత్ దూరం!

Author Icon By Divya Vani M
Updated: April 4, 2025 • 8:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

లక్నోలోని భారత్ రత్న శ్రీ అటల్ బిహారి వాజ్‌పేయి స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఐపీఎల్ 2025 సీజన్‌లో 16వ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌కి సంబంధించిన విశేషాలు ఫ్యాన్స్‌కి ఇప్పటికే తెగ ఆసక్తి కలిగిస్తున్నాయి.ఈసారి టాస్ గెలిచిన ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.అయితే ఈ నిర్ణయం ఆశ్చర్యం కలిగించలేదుకానీ, రోహిత్ శర్మ గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమైనట్లు హార్దిక్ వెల్లడించటం మాత్రం షాక్ ఇచ్చింది. ప్రాక్టీస్ సమయంలో రోహిత్ గాయం పాలయ్యాడట.లక్నో జట్టులో కీలకమైన మార్పు చోటు చేసుకుంది.మధ్యమ వేగం బౌలర్ ఆకాశ్ దీప్ జట్టులోకి వచ్చాడు.అతను ఎం సిద్ధార్థ్ స్థానంలో ఎంపికయ్యాడు.

LSG Vs MI గాయం కార‌ణంగా మ్యాచ్‌కు రోహిత్ దూరం!

ఈ నిర్ణయం బౌలింగ్ డెప్త్‌ను పెంచేలా కనిపిస్తోంది.ఇక ముంబయి జట్టు విషయానికి వస్తే, హార్దిక్ సారథ్యంలో జట్టులోని యంగ్ టాలెంట్ మీదే ఎక్కువ ఫోకస్ ఉంది.ముఖ్యంగా వికెట్ కీపర్‌గా రికెల్టన్‌కి అవకాశం ఇవ్వడం, బౌలింగ్ విభాగంలో బౌల్ట్, చాహర్ లాంటి అనుభవజ్ఞులు ఉన్నారు.ఈ సీజన్‌లో ఇప్పటివరకు ముంబయి, లక్నో – ఇరుజట్లు మూడేసి మ్యాచ్‌లు ఆడాయి.కానీ చెరో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచాయి.అంటే రెండింటికీ ప్రస్తుతం విజయాల అవసరం చాలా ఎక్కువ.ముంబయి ఇండియన్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది.లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం 7వ స్థానంలో ఉంది. ఇవి రెండూ మధ్యస్థాయి జట్లు అయినప్పటికీ, సరైన గేమ్ ప్లాన్‌తో టాప్ 4లోకి వెళ్లే స్కోప్ ఉంది.ముంబయి జట్టు ఎక్కువగా యంగ్ టాలెంట్ మీద ఆధారపడుతోంది. జాక్స్, ధీర్, బవా లాంటి యువ ఆటగాళ్లు జట్టుకి మంచి ఎనర్జీని ఇస్తున్నారు.హార్దిక్ ఆటలో అగ్రీషన్ ఉంది కానీ, కెప్టెన్సీలో ఇంకా మెరుగుదల అవసరం కనిపిస్తోంది.లక్నోనుంచి చూస్తే, పూరన్, పంత్ వంటి మ్యాచ్ విన్నర్స్ ఉన్నా.బ్యాటింగ్ లైనప్ అంతగా క్లిక్ అవడం లేదు. బౌలింగ్ మాత్రం ఇప్పటివరకు ఓకే అని చెప్పొచ్చు.

ఇంపాక్ట్ సబ్స్ – ఎవరెవరు?

ఇరుజట్లు ఇంపాక్ట్ ప్లేయర్లతో మ్యాచును తిరగరాయాలనుకుంటున్నాయి.

లక్నో సబ్‌లలో:

రవి బిష్ణోయ్

షాబాజ్

సిద్దార్థ్

ప్రిన్స్

ఆకాశ్

ముంబయి సబ్‌లలో:

తిలక్ వర్మ

బాష్

మింజ్

సత్యనారాయణ రాజు

కర్న్

ఈ ఆటగాళ్లు అవసరమైన సమయంలో బరిలోకి దిగే అవకాశం ఉంది.

ముంబయి ఇండియన్స్ ఫుల్ ప్లేయింగ్ XI:
జాక్స్

రికెల్టన్ (వికెట్ కీపర్)

ధీర్

సూర్యకుమార్

హార్దిక్ పాండ్యా (కెప్టెన్)

బవా

సాంట్నర్

చాహర్

బౌల్ట్

అశ్విని

పుత్తూరు

లక్నో సూపర్ జెయింట్స్ ఫుల్ ప్లేయింగ్ XI:


మార్ష్

మార్క్రమ్

పూరన్

పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్)

బదోని

మిల్లర్

సమద్

శార్ధూల్ ఠాకూర్

దిగ్వేశ్

ఆకాశ్ దీప్

అవేశ్ ఖాన్

IPL 2025 MI vs LSG IPL Toss Today Winner Lucknow Super Giants Squad 2025 MI vs LSG Match Preview Mumbai Indians Playing 11 Today Rohit Sharma Injury Update

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.