టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ పాల్గొనడంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ విషయంపై ఆ జట్టు కెప్టెన్ లిటన్ దాస్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత తీవ్రం చేశాయి. ప్రపంచకప్‌కు ఇంకా రెండు వారాల సమయం మాత్రమే ఉన్నా, బంగ్లాదేశ్ భాగస్వామ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. భద్రతా కారణాలను చూపిస్తూ తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB), ఐసీసీని కోరింది.
Read Also: IPL 2026: బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం
ఆసక్తికర వ్యాఖ్యలు
అయితే, ఈ అభ్యర్థనకు ఐసీసీ సుముఖంగా లేకపోవడంతో పలు దఫాలుగా జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. మంగళవారం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) మ్యాచ్ అనంతరం లిటన్ దాస్ (Litton Das) ను ప్రపంచకప్ సన్నద్ధతపై ప్రశ్నించగా,
బోర్డు తీరుతో మీరు ఏకీభవిస్తున్నారా? అని బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్‌ను ఓ రిపోర్టర్ ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘ఈ అంశంపై నేను మాట్లాడటానికి ఏమీ లేదు. వరల్డ్ కప్ ఇంకా చాలా దూరంలో ఉంది. జట్టు పాల్గొంటుందో లేదో నేను కచ్చితంగా చెప్పలేను. ఇండియాకు వెళ్లడానికి నిరాకరించే ముందు బోర్డు మాతో ఏమీ డిస్కస్ చేయలేదు’ అని లిటన్ దాస్ (Litton Das),చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: