Laxman Siva Ramakrishnan Resignation: శివరామకృష్ణన్ రాజీనామాలో బిగ్ ట్విస్ట్

Read Time:  1 min
Laxman Siva Ramakrishnan Resignation: శివరామకృష్ణన్ రాజీనామాలో బిగ్ ట్విస్ట్
FONT SIZE
GET APP

Laxman Siva Ramakrishnan Resignation: బీసీసీఐ (BCCI) వ్యాఖ్యాతగా దశాబ్దాల అనుభవం ఉన్న మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ తన రాజీనామా నిర్ణయంతో భారత క్రికెట్ వర్గాల్లో పెను సంచలనం సృష్టించారు. తొలుత బీసీసీఐపై విమర్శలు గుప్పించిన ఆయన, తాజాగా తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ సోషల్ మీడియాలో మరో పోస్ట్ పెట్టారు.

Read Also: Shreyas Iyer: గాయం వల్ల 7 కిలోల బరువు తగ్గా.. ఐసీయూలో ఉన్న రోజులు గుర్తుచేసుకున్న పంజాబ్ కెప్టెన్

“నా రాజీనామా చిత్రంలోకి బీసీసీఐ అడ్మినిస్ట్రేషన్ ను తీసుకురావొద్దు. బీసీసీఐలోని ఒకే ఒక్క ఉద్యోగి చేసిన నిర్వాకం ఇది. జైషాతోపాటు ఇతర పెద్దలకు ఇందులో ఎలాంటి పాత్ర లేదు. నా జీవిత పగ్గాలను నా చేతిలోకి తీసుకుంటున్నా. అలా చేసే హక్కు ఉందని భావిస్తున్నా” అని వెల్లడించారు.

laxman-sivaramakrishnan-resigns-commentator-bcci-clarification-jay-shah
laxman-sivaramakrishnan-resigns-commentator-bcci-clarification-jay-shah

Laxman Siva Ramakrishnan Resignation: శివరామకృష్ణన్ కెరీర్ ముఖ్యాంశాలు

శివరామకృష్ణన్ 2000 నుంచి కామెంట్రీ చేయడం మొదలు పెట్టారు. ఐసీసీ క్రికెట్ కమిటీలోనూ ప్రతినిధిగా వ్యవహరించిన అనుభవం ఉంది. అయితే టాస్ పాటు అవార్డుల ప్రజెంటేషన్ కార్యక్రమాల్లో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీసీసీఐ తనను 23 ఏళ్ల నుంచి నిర్లక్ష్యానికి గురి చేసిందని విమర్శించారు. ఇప్పుడు తాజా కామెంట్లతో భవిష్యత్తులో ఎలాంటి పాత్ర పోషిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.