మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్లో (2025 Women’s Cricket World Cup)సౌతాఫ్రికా జట్టు అద్భుతంగా పోరాడినప్పటికీ 52 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.. ఆదివారం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన తుది పోరులో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు తొలిసారిగా ప్రపంచకప్ ఫైనల్‌కు చేరి అందరి ప్రశంసలు అందుకుంది. అయితే, చివరి దశలో వరుసగా వికెట్లు కోల్పోవడం వల్లే జట్టు ఓటమిపాలైందని కెప్టెన్ లారా వోల్వార్డ్ (Laura Volward) వెల్లడించింది.
Read Also: CM Revanth: టీమిండియా ఘన విజయం.. శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన లారా వోల్వార్డ్ (Laura Volward).. బ్యాటింగ్ వైఫల్యం విజయవకాశాలను దెబ్బతీసిందని అభిప్రాయపడింది. ఫైనల్లో ఓడినా ఈ టోర్నీలో తమ జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉందని చెప్పింది.
మారిజానే కాప్ కోసమైనా ఈ టైటిల్ గెలవాలనుకున్నామని, కానీ సాధ్యం కాలేదని ఆవేదన వ్యక్తం చేసింది.’ఈ టోర్నీలో మా జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. టోర్నీ ఆసాంతం అద్భుతమైన క్రికెట్ ఆడాం. దురదృష్టవశాత్తు తుది పోరులో ఓటమిపాలయ్యాం. కానీ ఈ ఓటమిని ఓ గుణపాఠంగా స్వీకరించి ముందుకు సాగుతాం.
వాటి నుంచి తిరిగి పుంజుకున్నాం
ఈ టోర్నీలో మేం రెండు చెత్త ప్రదర్శనలు కనబర్చినప్పటికీ.. వాటి నుంచి తిరిగి పుంజుకున్నాం. కొన్నిసార్లు అద్భుతంగా ఆడితే మరికొన్నిసార్లు చెత్తగా ఆడాం. కానీ అదృష్టవశాత్తూ బాగా ఆడిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ టోర్నీలో మేం చూపిన పోరాటం పట్ల గర్వపడుతున్నాను.’ఈ టోర్నీలో మా జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది.
టోర్నీ ఆసాంతం అద్భుతమైన క్రికెట్ ఆడాం. దురదృష్టవశాత్తు తుది పోరులో ఓటమిపాలయ్యాం. కానీ ఈ ఓటమిని ఓ గుణపాఠంగా స్వీకరించి ముందుకు సాగుతాం. ఈ టోర్నీలో మేం రెండు చెత్త ప్రదర్శనలు కనబర్చినప్పటికీ.. వాటి నుంచి తిరిగి పుంజుకున్నాం.
అదృష్టవశాత్తూ బాగా ఆడిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి
కొన్నిసార్లు అద్భుతంగా ఆడితే మరికొన్నిసార్లు చెత్తగా ఆడాం. కానీ అదృష్టవశాత్తూ బాగా ఆడిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ టోర్నీలో మేం చూపిన పోరాటం పట్ల గర్వపడుతున్నాను.ఈ మ్యాచ్‌లో పిచ్ నుంచి స్వింగ్ లభిస్తుందని ఆశించాం. పిచ్‌లో ఇంకా కొద్దిగా తేమ ఉంది. కాబట్టి ముందుగా బౌలింగ్ చేయడం సరైన నిర్ణయమేనని అనుకుంటున్నా.
ఛేజింగ్‌లో చాలా వరకు మేం రేసులో ఉన్నాం. కానీ త్వరగా వికెట్లు కోల్పోవడం మాకు నష్టం చేసింది. నేను స్కోర్ బోర్డును పదే పదే చూస్తూ ఆడాను. ఈ మ్యాచ్‌లో భారత్ 350 పరుగులు చేసేలా కనిపించింది. కానీ చివర్లో మా బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు.ఈ టోర్నీ మొత్తం మా బౌలింగ్ బాగుంది.
మారిజానే కాప్ కు చివరి ప్రపంచకప్
మేం ఈ లక్ష్యాన్ని చేధించగలమని భావించాం. కానీ సాధ్యం కాలేదు. షెఫాలీ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ఆమె తన దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్లను దెబ్బతీయగలదు. మారిజానే కాప్ సుదీర్ఘ కాలంగా మా జట్టు తరఫున ఆడుతోంది.
ఇది ఆమెకు చివరి ప్రపంచకప్ అవుతున్నందుకు బాధగా ఉంది. కప్ గెలిచి ఆమెకు ఘన వీడ్కోలు పలకాలని భావించాం. ఆమె ఇద్దరు ప్లేయర్లతో సమానం. అలాంటి ప్లేయర్ మా జట్టులో ఉండటం మా అదృష్టం.’అని లారా వోల్వార్డ్ చెప్పుకొచ్చింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: