📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Vijay Dahiya రోహిత్, కోహ్లీల వన్డే భవిష్యత్తుపై వికెట్ కీపర్ విజయ్ దహియా వ్యాఖ్యలు

Author Icon By Anusha
Updated: August 29, 2025 • 2:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెట్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Rohit and Kohli) రిటైర్మెంట్. ఇప్పటికే వీరిద్దరూ టెస్ట్, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికారు. ఇప్పుడు వన్డేల్లోనూ రిటైర్ అవుతారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ వికెట్ కీపర్ విజయ్ దహియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.దహియా అభిప్రాయం ప్రకారం, రోహిత్–కోహ్లీ భవిష్యత్తు నిర్ణయం పూర్తిగా వారి వ్యక్తిగతమైనదే. 2027లో జరిగే వన్డే ప్రపంచకప్ వరకు ఆడాలా, వద్దా అనే తుది నిర్ణయం వారికే వదిలేయాలని ఆయన సూచించారు. “ఇలాంటి దిగ్గజ ఆటగాళ్లు దేశానికి చేసిన సేవలు అపారమైనవి. అందుకే వారు ఎప్పుడు ఆగాలో నిర్ణయించుకునే హక్కు వారిది. ఎవరికీ వారిపై ఒత్తిడి చేయడానికి హక్కు లేదు” అని దహియా స్పష్టం చేశారు.అయితే, టీమ్ మేనేజ్‌మెంట్, సెలెక్టర్ల పాత్రను ఆయన విస్మరించలేదు. జట్టు సమీకరణల్లో, కొత్త ప్రతిభావంతులకు అవకాశాలు ఇచ్చే విషయంలో వారు కీలకమని ఆయన గుర్తుచేశారు. కానీ సీనియర్ ఆటగాళ్ల (Senior players) తో వ్యవహరించే సమయంలో గౌరవం కోల్పోకూడదని సూచించారు.

Latest News

ఇతరులు నిర్ణయం తీసుకోవాలని చూస్తుంటారు

“మన దగ్గర చాలాసార్లు ఒక తప్పు జరుగుతోంది. ఈ లెజెండ్స్ ఇంకా ఆడుతూనే ఉన్నప్పుడు వారిని సరైన స్థాయిలో గౌరవించడం మర్చిపోతాం. కానీ ఒకసారి రిటైర్ (Retire) అయిన తర్వాతే వాళ్ల విలువను గుర్తిస్తాం. ఇది సరికాదు” అని దహియా అన్నారు.ఆటపై ప్రేరణ, ఫిట్‌నెస్ అనేవి ఆటగాళ్ల వ్యక్తిగత విషయం. వారి తరఫున ఇతరులు నిర్ణయం తీసుకోవాలని చూస్తుంటారు. కానీ ఇది వారి వ్యక్తిగత నిర్ణయం. వారు దేశానికి అందించిన సేవలను బట్టి చూస్తే, ఏం చేయాలో, ఏం చేయకూడదో వారికి ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు” అని దహియా తేల్చిచెప్పాడు. ఇప్పటికే టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికిన ఈ ఇద్దరూ, అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌తో ఈ ఫార్మాట్‌కు కూడా గుడ్‌బై చెప్పవచ్చని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ కెప్టెన్సీల మధ్య పోలికలు తేవడాన్ని దహియా తప్పుబట్టాడు. “ఇద్దరూ భిన్నమైన నాయకులు, ఇద్దరూ తమ జట్లకు ట్రోఫీలు గెలిచిపెట్టారు. రోహిత్ దూకుడు శైలి ప్రత్యేకం, ధోనీ ప్రశాంతత విలక్షణమైనది. వారిద్దరినీ పోల్చడం సరికాదు” అని ఆయన ‘స్పోర్ట్స్‌యారీ’తో అన్నాడు.

Read hindi news: https://hindi.vaartha.com/

Read Also:

https://vaartha.com/telugu-news-shami-responds-to-hasin-jahan-controversy/sports/537678/

2027 odi world cup Breaking News indian cricket seniors latest news Rohit Sharma retirement news Telugu News vijay dahiya comments virat kohli odi retirement

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.