📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Shreyas Iyer వన్డే కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌?

Author Icon By Anusha
Updated: August 21, 2025 • 12:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెట్‌లో సారథ్యం మార్పు దశలో ఉందని చెప్పొచ్చు. రాబోయే సెప్టెంబర్ 9న ప్రారంభమయ్యే ఆసియా కప్‌ (Asia Cup 2025) కోసం బీసీసీఐ ఇటీవల ప్రకటించిన జట్టులో శ్రేయస్ అయ్యార్‌కు చోటు దక్కకపోవడం పెద్ద చర్చనీయాంశమైంది. నిరంతర ఫామ్‌లో ఉండి, వన్డే క్రికెట్‌లో మంచి ప్రదర్శనలు కనబరుస్తున్న శ్రేయస్‌ను పక్కనపెట్టడంతో అభిమానులు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తాజాగా వెలువడిన సమాచారం ప్రకారం, వన్డే కెప్టెన్సీ బాధ్యతలు భవిష్యత్తులో శ్రేయస్ అయ్యార్‌కు అప్పగించాలనే ఆలోచన బీసీసీఐలో నడుస్తోందట.ప్రస్తుతం వన్డే జట్టుకు రోహిత్ శర్మనే కెప్టెన్‌గా కొనసాగిస్తున్నాడు. కానీ ఆయన ఇప్పటికే టెస్ట్‌, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. ఇక త్వరలోనే వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశముంది. అలాంటి సందర్భంలో కొత్త కెప్టెన్ ఎవరవుతారన్న ప్రశ్న సహజంగానే ముందుకు వచ్చింది. టెస్టులకు శుభ్‌మన్ గిల్, టీ20లకు సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) సారథ్యం వహిస్తున్నారు. ఇక వన్డేలకు వారసుడు ఎవరు అన్న దానిపై ఎక్కువ ఆసక్తి నెలకొంది.

పెద్దలు యోచిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది

ఈ క్రమంలోనే ODI కెప్టెన్సీ రేసులో శ్రేయస్ అయ్యార్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. రోహిత్ తర్వాత శ్రేయస్ అయ్యార్‌కే సారథ్య బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉందని BCCI వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం 50 ఓవర్ల వన్డే మ్యాచ్‌లకు శుబ్‌మన్ గిల్ వైస్‌ కెప్టెన్‌గా ఉన్నారు. వర్క్‌లోడ్‌ నిర్వహణలో భాగంగా కెప్టి్న్సీ బాధ్యతలు గిల్‌కు కాకుండా శ్రేయస్‌ (Shreyas Iyer) కు అప్పగించాలని బీసీసీఐ పెద్దలు యోచిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే ఆసియా కప్ వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలు గిల్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఇక రాబోయే రోజుల్లో టీమిండియా వరుస ద్వైపాక్షిక సిరీస్లు, ఐసీసీ ఈవెంట్లలో ఆడనుంది. మూడు ఫార్మాట్లలో ఒకే ఆటగాడు కెప్టెన్‌గా ఉండటం సాధ్యం కాదు. అందుకే గిల్‌కు టెస్టు కెప్టెన్సీతో పాటు టీ20ల్లో వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.  భవిష్యత్తులో గిల్ టీ 20 కెప్టెన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కానీ వన్డే కెప్టెన్సీ మాత్రం శ్రేయస్‌ అయ్యార్‌ లాంటి ప్లేయర్లే కెప్టెన్సీ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. 

Latest News

టీమ్ ఇండియా జట్టుగా కెప్టెన్‌గా

మరో విషయం ఏంటంటే శ్రేయస్ అయ్యార్ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా టీమ్ ఇండియా జట్టుగా కెప్టెన్‌గా ఉండలేదు. కానీ ఐపీఎల్‌లో మాత్రం అతడికి కెప్టెన్‌గా చేసిన అనుభవం ఉంది. ముంబై టీమ్‌గా అయ్యార్ కెప్టెన్‌గా ఉన్నాడు. అలాగే 2024/25 విజయ్ హజారే ట్రోఫీకి కూడా సారథ్యం వహించాడు. ఈ టోర్నమెంట్‌లో అతడు 5 మ్యాచ్‌లు ఆడి 325 పరుగులు చేశాడు. ఇక 2024 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో కూడా అతడు ముంబై టీమ్‌కు కెప్టెన్‌గా ఉండి ట్రోఫీ అందించాడు.ఇదిలాఉండగా ఆసియా కప్‌-2025 యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9న ప్రారంభం కానుంది. సెప్టెంబర్‌ 28 వరకు అక్కడ మ్యాచ్‌లు జరగనున్నాయి. వీటిని టీ20 ఫార్మాట్‌లలోనే నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో  సెప్టెంబర్‌ 10న భారత జట్టు మొదటి మ్యాచ్‌ ఆడనుంది. సెప్టెంబర్ 14న భారత్‌, పాక్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. సెప్టెంబర్‌ 19న లీగ్ చివరి మ్యాచ్‌లో చూసుకుంటే ఒమన్‌తో టీమిండియా తలపడనుంది.

ఆయన ఏ రాష్ట్రానికి చెందినవారు?

శ్రేయస్ అయ్యర్ మహారాష్ట్రకు చెందినవారు.

శ్రేయస్ అయ్యర్ ఏ ఫార్మాట్‌లో ఎక్కువగా రాణించారు?

వన్డే (ODI) ఫార్మాట్‌లో శ్రేయస్ అయ్యర్ అత్యంత విజయవంతంగా రాణించాడు. మధ్యవరుసలో జట్టుకు స్థిరత్వం తీసుకువచ్చాడు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/vinod-kambli-unable-to-speak/sports/533481/

Asia Cup 2025 BCCI team announcement Breaking News latest news ODI captaincy race Shreyas Iyer captaincy news Shreyas Iyer excluded Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.