టీమిండియా ప్రస్తుత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అనేక రికార్డులు సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా వన్డే క్రికెట్‌లో మూడు డబుల్ సెంచరీలు సాధించడం ద్వారా ఆయన పేరు అంతర్జాతీయ క్రికెట్‌లో చరిత్రలో నిలిచిపోయింది. అయితే, ఆయనను టీమిండియాలోని ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్ల జాబితాలో చూడలేమని మాజీ క్రికెటర్, ప్రస్తుత కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
తాజాగా దూరదర్శన్‌లో ప్రసారమవుతున్న గ్రేట్ ఇండియన్ క్రికెట్ షోలో పాల్గొన్న మంజ్రేకర్, “రోహిత్ శర్మ ఎంత అద్భుతమైన ఆటగాడైనా, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజాల సరసన నిలబడలేడని నా అభిప్రాయం” అని స్పష్టం చేశారు.
కఠిన సమయాల్లో మ్యాచ్‌ను నిలబెట్టడం
మంజ్రేకర్ ప్రకారం, రోహిత్ శర్మ ఒక మ్యాచ్ విన్నర్ అయినప్పటికీ, నిరంతరాయంగా జట్టుకు సేవ చేయడం, కఠిన సమయాల్లో మ్యాచ్‌ను నిలబెట్టడం వంటి లక్షణాలు ద్రవిడ్, సచిన్, కోహ్లీ వంటి వారిలో ఉన్నట్లు రోహిత్‌లో లేవని ఆయన అభిప్రాయం. “రోహిత్ గొప్ప ఇన్నింగ్స్ ఆడతాడు, కానీ ఎప్పటికప్పుడు అదే స్థాయిలో కొనసాగించలేడు. అదే ఒక గ్రేట్ ఆటగాడిని ప్రత్యేకంగా నిలబెడుతుంది” అని ఆయన అన్నారు.నా అభిప్రాయం ప్రకారం టీమిండియా ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్ల జాబితాలో రోహిత్ శర్మ (Rohit Sharma) లేడు. అందుకు అతను సరిపోడు.
ప్రజల్లో అతనిపై ఉన్న ప్రేమ మరింత రెట్టింపు
ఎందుకంటే సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాల స్థాయిని రోహిత్ శర్మ చేరుకోలేదు. అయితే కెప్టెన్‌గా రోహిత్ శర్మకు తిరుగులేదు. అతని స్వార్థరహిత కెప్టెన్సీని కచ్చితంగా కొనియాడాల్సిందే. ముఖ్యంగా 2023 వన్డే ప్రపంచకప్ (2023 ODI World Cup) తర్వాత ప్రజల్లో అతనిపై ఉన్న ప్రేమ మరింత రెట్టింపు అయ్యింది. అతను ఎప్పుడూ తన గురించి ఆలోచించలేదు. జట్టు కోసం తన స్వప్రయోజనాలను కూడా త్యాగం చేసేందుకు సిద్దమయ్యాడు. అదే అతన్ని పత్యేకంగా నిలబెట్టింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతని ఆధిపత్యం చూడముచ్చటగా ఉండేది.
అతను భారత ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్ల
ఒకే వన్డే ఇన్నింగ్స్‌లో అలవోకగా 300 పరుగులు చేసేంత ఆధిపత్యం చెలాయించేవాడు. కానీ భారత ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్ల గురించి మాట్లాడినప్పుడు టెస్ట్ క్రికెట్‌ను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ రెడ్ బాల్ ఫార్మాట్‌లో రోహిత్ శర్మ అంతగా ప్రభావం చూపలేదు. అందుకే అతను భారత ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్లలో ఒకడు కాదని చెబుతున్నా.’అని సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై రోహిత్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ, సచిన్, గవాస్కర్ కంటే కూడా రోహిత్ గొప్ప ఆటగాడు, నాయకుడని కామెంట్ చేస్తున్నారు. రోహిత్ సారథ్యంలో భారత్ రెండు ఐసీసీ టైటిళ్లు గెలిచిందని గుర్తు చేస్తున్నారు. సంజయ్ మంజ్రేకర్‌కు బుద్ది లేదని ఘాటుగా విమర్శిస్తున్నారు.
అత్యధిక పరుగులు చేసిన నాలుగో భారత బ్యాటర్
సంజయ్ మంజ్రేకర్ చెప్పినట్లు టెస్ట్ క్రికెట్‌లో రోహిత్ శర్మకు గొప్ప రికార్డ్ లేదు. కానీ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా హిట్ మ్యాన్ కొనసాగుతున్నాడు. మూడు ఫార్మాట్లలో కలిపి అతను 19,700 పరుగులు చేశాడు. 67 టెస్ట్‌ల్లో 4301 పరుగులు చేసిన హిట్ మ్యాన్.. వన్డేల్లో 11, 168 రన్స్ చేశాడు. వన్డే ఫార్మాట్‌లో మూడు డబుల్ సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. అంతేకాకుండా అత్యధిక వ్యక్తిగత స్కోర్ (264) రికార్డ్ కూడా రోహిత్ పేరిటే ఉంది. టీ20లతో పాటు టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు.
Read hindi news:hindi.vaartha.com
Read Also: