📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Sandeep Sharma – శ్రేయస్ అయ్యర్‌కు టీమిండియా కెప్టెన్సీ ఇవ్వాలనడం సరికాదు

Author Icon By Anusha
Updated: September 4, 2025 • 4:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐపీఎల్‌లో ఒక ఆటగాడు ప్రదర్శన చూపించాడని మాత్రమే ఆధారంగా తీసుకుని, అతనికి నేరుగా భారత జట్టు కెప్టెన్సీ ఇవ్వడం సరికాదని రాజస్థాన్ రాయల్స్ అనుభవజ్ఞుడైన పేసర్ సందీప్ శర్మ స్పష్టం చేశాడు. ఐపీఎల్ ఒక ఫ్రాంచైజీ లీగ్ మాత్రమేనని, ఆ లీగ్‌లో మంచి ప్రదర్శన చేసిన ప్రతీ ఆటగాడికి భారత జట్టు సారథ్యం ఇచ్చేయడం తెలివితక్కువ పని అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఐపీఎల్ ప్రదర్శనతో శ్రేయస్ అయ్యర్‌కు టీమిండియా కెప్టెన్సీ ఇవ్వాలనడం సరికాదని రాజస్థాన్ రాయల్స్ వెటరన్ పేసర్ సందీప్ శర్మ (Sandeep Sharma) అన్నాడు. ఇంత కంటే తెలివి తక్కువ పని మరొకటి ఉండదని అభిప్రాయపడ్డాడు.

సందీప్ శర్మ మాట్లాడుతూ – “ఐపీఎల్ ఒక అద్భుతమైన వేదిక. ఆటగాళ్లు తమ ప్రతిభను చూపించడానికి ఇది గొప్ప అవకాశమే. కానీ ఐపీఎల్‌లో జట్టును నడిపించడం, టీమిండియాను నడిపించడం పూర్తిగా భిన్నమైన బాధ్యతలు. ఒక ఫ్రాంచైజీ జట్టులో 4–5 విదేశీ ఆటగాళ్లు, యువ ఆటగాళ్లు ఉంటారు. ఆ జట్టును నడిపించడం అంత కష్టమైన పని కాదు. కానీ భారత జట్టును నడిపించాలి అంటే, బిలియన్ల మంది అభిమానుల ఆశలు, అంచనాలను మోయాలి. ప్రతి మ్యాచ్, ప్రతి సిరీస్ దేశ గౌరవం కోసం ఆడాల్సి ఉంటుంది. అలాంటి సారథ్యం చాలా అనుభవం, సహనం, వ్యూహాత్మక ఆలోచన కావాలి” అని వివరించాడు.

విశ్లేషకులు తప్పుబట్టారు

ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) మెరుగైన ప్రదర్శన చేసినా..భారత టీ20 జట్టులోకి తీసుకోకపోవడంపై ఫ్యాన్స్, విశ్లేషకులు తప్పుబట్టారు. 11 ఏళ్ల తర్వాత పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్ చేర్చాడని, టీమిండియా కెప్టెన్‌గా నియమించాల్సిన ఆటగాడిని జట్టులోకి తీసుకోరా? అని విమర్శలు గుప్పించారు. టీమిండియాను నడిపించాల్సిన ఆటగాడిని రాజకీయాలతో పక్కనపెడుతున్నారని మండిపడ్డారు.తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన సందీప్ శర్మ.. ఈ వాదన సరికాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

‘ఐపీఎల్‌లో మెరుగ్గా రాణించినంత మాత్రాన శ్రేయస్ అయ్యర్‌ను టీమిండియాకు కెప్టె‌న్‌ చేయాలనడం సరి కాదు. ఐపీఎల్ (IPL) జట్టుకు సారథ్యం వహించడం, భారత జట్టును నడిపించడం పూర్తిగా భిన్నమైన విషయాలు. ప్రజలు ముందుగా ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి. బీసీసీఐకి సొంత దేశీయ లీగ్ ఉంది. అక్కడ ఎంతో మంది ఆడుతుంటారు. కానీ అంతర్జాతీయ జట్టును ఎంపిక చేసేటప్పుడు అత్యుత్తమ 15 మంది ఆటగాళ్లను ఎంచుకుంటారు.

Latest News

అత్యుత్తమ సారథి

ఆ 15 మంది ఆటగాళ్లను నడిపించే అత్యుత్తమ సారథిని ఎంపిక చేస్తారు. కానీ, ఐపీఎల్‌లో స్థానిక ఆటగాళ్లు, యువ ఆటగాళ్లు, విదేశీ ఆటగాళ్లతో మిశ్రమ జట్టు ఉంటుంది. కాబట్టి ఐపీఎల్‌ ప్రదర్శన ఆధారంగా అంతర్జాతీయ మ్యాచ్‌లకు కెప్టెన్ చేయాలని అడగడం అర్థరహితం.’అని సందీప్ శర్మ చెప్పుకొచ్చాడు.

సందీప్ శర్మ అభిప్రాయం పక్కన పెడితే.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ రికార్డ్ అద్భుతంగా ఉంది. అతను ఐపీఎల్‌లోనే కాకుండా దేశవాళీ టోర్నీల్లో కూడా ముంబైని అద్భుతంగా నడిపించాడు. 2024-25 విజయ్ హజారే ట్రోఫీలోనూ కెప్టెన్‌గా 5 మ్యాచ్‌ల్లో 325 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లోనూ కేకేఆర్‌ను విజేతగా నిలబెట్టిన అయ్యర్.. పంజాబ్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఫైనల్ చేర్చాడు.

శ్రేయస్ అయ్యర్ జననం ఎక్కడ, ఎప్పుడు జరిగింది?

ఆయన 1994 డిసెంబర్ 6న ముంబైలో జన్మించాడు.

శ్రేయస్ అయ్యర్ తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఎప్పుడు ఆడాడు?

2017లో ఆయన భారత జట్టు తరఫున తొలి వన్డే, టీ20 మ్యాచ్‌లలో ఆడాడు.

Read hindi news : hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-shikhar-dhawan-ed-notices-cricketer-shikhar-dhawan-in-money-laundering-case/crime/541118/

Asia Cup 2025 Breaking News Cricket News india captaincy Indian Cricket ipl performance latest news Rajasthan Royals sandeep sharma shreyas iyer Team India Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.